బిజినెస్ రంగంలో సామ్ ఫోకస్.. మరో ఇంటర్‌నేషనల్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా సమంత..

|

Apr 07, 2023 | 8:53 PM

ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంటోంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్, లూయిస్ విట్టన్ అనే ఇంటర్నేషనల్ బ్యాగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా టామీ హిల్ ఫిగర్‌ను కూడా సామ్‌ తనఖాతాలోకి వేసుకుంది.

బిజినెస్ రంగంలో సామ్ ఫోకస్.. మరో ఇంటర్‌నేషనల్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా సమంత..
Samantha Ruth Prabhu
Follow us on

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం భారీ సినిమాల దర్శకడు గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన మైథలాజికల్ గ్రాండియర్ మూవీ శాకుంతలం. దేవ్ మోహన్ హీరో గా నటించిన ఈ మూవీని దిల్ రాజు సమర్పిస్తుండగా గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ దీనిని భారీ పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 14న పలు భాషల ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. మరోవైపు దీనితో పాటు హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ యొక్క షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు సమంత. ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంటోంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్, లూయిస్ విట్టన్ అనే ఇంటర్నేషనల్ బ్యాగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా టామీ హిల్ ఫిగర్‌ను కూడా సామ్‌ తనఖాతాలోకి వేసుకుంది. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ ప్రకటనల్లో సామ్ కనిపించనుంది.

టామీ హిల్ఫైయర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్ఫైయర్. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్ఫైయర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. ఆమెకు సంబంధించి యాడ్స్ను అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగనుంది. టామీ హిల్ఫైయర్ నుంచి రాబోతున్న విమెన్ కలెక్షన్ వాచ్ల్లో ఈసారి వైవిధ్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

టామీ హిల్ఫైయర్కు సమంత బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరించడంపై మోవాడా గ్రూప్ ప్రెసిడెంట్ రిచర్డ్ సీజర్ మార్టిన్స్ హర్షం వ్యక్తం చేశారు. టామీ బ్రాండ్ సమ్మర్ 2023 వాచ్ కలెక్షన్ను సమంతతో కలసి ప్రవేశపెడుతున్నందుకు ఉద్విగ్నంగా అలాగే గర్వంగానూ ఉందని ఆయన చెప్పారు. ఈ సీజన్ తమ వారసత్వాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తామనే దానికి తార్కాణంగా నిలవబోతోందన్నారు. సరికొత్త డిజైన్లు, నూతన రంగుల్లో ఉత్పత్తులను అందించడం టామీ సంస్థ ప్రత్యేకత అని రికార్డో సీజన్ పేర్కొన్నారు. సమంతలాగే ఈ కొత్త వాచ్లు కూడా డిజైన్, రంగు, నాణ్యతలో ఎంతో అపూర్వమని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

టామీ హిల్ఫైయర్ నుంచి వస్తున్న విమెన్స్ వాచ్ల్లో స్టీల్, గోల్డ్ ప్లేట్, లెదర్వి కూడా ఉన్నాయి. అన్ని వేడుకులకు ధరించేలా వీటిని డిజైన్ చేశారు. వాచ్లాగే కాకుండా చేతికి వేసుకునే బ్రేస్లెట్లా కూడా ఈ కొత్త ఉత్పత్తులను టామీ కంపెనీ రూపొందించింది. తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై సమంత స్పందించారు. టామీ ఫ్యామిలీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. వ్యక్తిగత అందంలో గడియారాలను ఒక భాగంగా తాను చూస్తూ వచ్చానన్నారు సామ్. టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ అని. ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత స్టైల్, డిజైన్ ఉండేలా ఈ కంపెనీ ఉత్పత్తులను అందిస్తుందని సమంత ప్రశంసలు కురిపించారు. ఈ సంస్థ వాచ్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని.. ఇవి తన వైవిధ్యమైన లుక్స్కు సరిగ్గా సరిపోతాయని చెప్పుకొచ్చారు. టామీ నుంచి వస్తున్న స్ప్రింగ్ సమ్మర్ వాచ్లు తనకు ఎంతో నచ్చాయని.. వీటిని అందరికీ పరిచయం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సమంత పేర్కొన్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం..