‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీనితో వరస ఆఫర్స్ అందుకున్న అజయ్ భూపతి.. మొదట రామ్ హీరోగా భవ్య మూవీస్ బ్యానర్ మీద ఒక సినిమా ఉంటుందన్నారు. అది కాస్తా క్యాన్సిల్ అయింది. ఇకపోతే ఈలోపు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అజయ్.
‘మహా సముద్రం’ అనే టైటిల్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ తో మంచి కథ సిద్ధం చేశాడు అజయ్. దీనికి శ్రీనివాస్ కూడా ఓకే చెప్పాడట. ఇక ఇందులో హీరోయిన్ గా సమంతాని అనుకున్నారట చిత్ర యూనిట్. అసలు విషయం ఏంటో తెలియదు గానీ.. కథ నచ్చక.. ఈ సినిమా చెయ్యనని చెప్పిందని వినికిడి. దీనితో మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు నిర్మాతలు.
కాగా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ వర్మ డైరెక్షన్ లో , నూతన దర్శకుడి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ సినిమా ఉంటుందని సమాచారం.