తెలుగు నటి శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య ఉన్న హోటల్‌లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నాగచైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు వండిస్తున్నారు. అయితే ఈ వార్తలపై అటు నాగచైతన్య కానీ, ఇటు శోభిత కానీ స్పందించలేరు.
ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి డేటింగ్ వార్తలపై నటి, నాగచైతన్య మాజీ భార్య సమంత స్పందించినట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయమై మాట్లాడినట్లు కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. ‘ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తను ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’ అంటూ సమంత తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ఇది కాస్త నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. నాగచైతన్యను ఉద్దేశించి సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. ఈ వార్త కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి సమంత చెవిలో పడింది. దీంతో వెంటనే ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓ మీడియా సంస్థ పోస్ట్ చేసిన వార్తను ట్వీట్ చేస్తూ.. ‘నేను ఇలా చెప్పుడు చెప్పలేను’ అని సింపుల్‌గా పుకార్లు కొట్టి పడేసింది. దీంతో ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.