Movie: హైదరాబాద్‌లో రేండేళ్లు నడిచిన సినిమా.. ఆ కళా ఖండానికి 30 ఏళ్లు..

|

Aug 06, 2024 | 2:47 PM

సల్మాన్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్‌ కెరీర్‌కు ఈ సినిమా బూస్ట్‌ను ఇచ్చించి ఫుల్ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సూరజ్‌ భరత్యాజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమా కోట్ల రూపాయలు రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది...

Movie: హైదరాబాద్‌లో రేండేళ్లు నడిచిన సినిమా.. ఆ కళా ఖండానికి 30 ఏళ్లు..
Hum Aapke Hain Koun
Follow us on

‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 90వ దశకంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భాసతో సంబంధం లేకుండా విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులోకి ప్రేమాలయం పేరుతో డబ్‌ చేశారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై ఆగస్టు 5వ తేదీకి సరిగ్గా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సల్మాన్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్‌ కెరీర్‌కు ఈ సినిమా బూస్ట్‌ను ఇచ్చించి ఫుల్ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సూరజ్‌ భరత్యాజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమా కోట్ల రూపాయలు రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందంటే.. ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. ఫుల్‌ రన్‌టైమ్‌లో ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా హైదరాబాద్‌లో ఓ అరుదైన ఘనతను సాధించింది. ఈ సినిమా హైదరాబాద్‌లో ఏకంగా 2 ఏళ్లు సక్సెస్‌ ఫుల్‌గా నడిచిందని మీకు తెలుసా.? హైదరాబాద్‌ కాచిగూడలోని ఐకానిక్‌ మహేశ్వరీ థియేటరల్లో ఈ సినిమా 100 రోజుల్లో నడిచి రూ. 68,06,356 వసూళ్లు రాబట్టి ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను సృష్టించింది. కాగా మధ్యలో షోలో మూవీ విడుదల కారణంగా సినిమాను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ తర్వాత మళ్లీ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా ఏకంగా ప్రతీ రోజూ మూడు షోలతో 413 రోజులు నడించింది.

ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా కాచిగూడలోని ఐకానిక్‌ మహేశ్వరీ థియేటర్‌లో సింగిల్‌ షోతో కలుపుకొని 651 రోజులు నడించింది. ఇలా ఈ సినిమా ఒకే థియేటర్‌లో ఏకంగా దాదాపు రెండేళ్లు నడవడం విశేషం. సల్మన్‌ ఖాన్‌కి ఆ సమయంలోనే హైదరాబాద్‌, నైజాం ఏరియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇన్ని అరుదైన రికార్డులను సృష్టించింది కాబట్టే 30 ఏళ్లు గడుస్తోన్నా ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..