AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaman Khan: సినీ విమర్శకుడు కమల్‌పై మరోసారి కోర్టు మెట్లెక్కిన సల్మాన్‌..

బాలీవుడ్‌లో సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్‌.ఖాన్‌ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌పై వరుసగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు..

Salaman Khan: సినీ విమర్శకుడు కమల్‌పై మరోసారి కోర్టు మెట్లెక్కిన సల్మాన్‌..
Basha Shek
|

Updated on: Nov 22, 2021 | 9:54 PM

Share

బాలీవుడ్‌లో సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్‌.ఖాన్‌ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌పై వరుసగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘రాధే’పై నెగెటివ్‌ రివ్యూలతో మొదలైన ఆయన విమర్శలు సల్లూభాయ్‌ సొంత బ్రాండ్ ‘బీయింగ్‌ హ్యూమన్‌’ దాకా చేరాయి. అదేవిధంగా ‘రాధే’ హీరోయిన్‌ దిశా పటానీని, సల్మాన్‌తో సన్నిహితంగా ఉండే షారుఖ్‌ ఖాన్‌, గోవిందా తదితర సెలబ్రిటీలపై కూడా పదునైన విమర్శలు చేస్తున్నారు కమల్‌. సోషల్‌ మీడియాలో వారికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రాధే’ సినిమా సమయంల కమల్‌పై కోర్టు మెట్లెక్కిన సల్మాన్‌ మరోసారి ఈ సినీ క్రిటిక్‌పై కేసు దాఖలు చేశాడు. ఈ విషయాన్ని కమలే సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సల్మాన్‌ నన్ను ఇంతగా లవ్‌ చేస్తున్నాడా.. ‘నాకు కోర్టు నుంచి మళ్లీ నోటీసులు అందాయి. సల్మాన్‌కు వ్యతిరేకంగా నేను ఏ వీడియో చేయలేదు. అతను నటించిన ఏ సినిమాకు నేను రివ్యూ ఇవ్వలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కానీ, అతను నాకు వ్యతిరేకంగా అతడు మరోసారి కేసు వేశాడు. ఈ కేసు విచారణకు నవంబర్ 29న రాబోతోంది. సల్మాన్ ఖాన్ నన్ను ఇంత లవ్ చేస్తున్నాడని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అతడు 24*7 ప్రతి క్షణం నన్ను మిస్ అవుతున్నాడు ’’ అని ట్విట్టర్‌లో కమల్ రాసుకొచ్చారు.

Also Read:

Thalli Pogathey : విడుదలకు సిద్ధమైన నిన్నుకోరి తమిళ రీమేక్‌.. అనుపమకు డబ్బింగ్‌ చెప్పిన సింగర్‌ చిన్మయి..

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్