మరోసారి టైగర్‏గా రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్..

|

Feb 08, 2021 | 7:05 AM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి టైగర్‏గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై అనే చిత్రాల్లో నటించిన సల్మాన్.

మరోసారి టైగర్‏గా రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్..
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి టైగర్‏గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ అనే చిత్రాల్లో నటించిన సల్మాన్.. మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మర్చిలో ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సల్మాన్ నటించిన రాధే మూవీ ఈద్ సందర్భంగా థియేటర్లలోకి రానుంది. అలాగే సల్మాన్.. మహేష్ మంజ్రాకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత టైగర్ 3 చిత్రీకరణలో పాల్గొన్నారు.

టైగర్ 3 సినిమాకు మనీష్ శర్మ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‏గా నటించనుంది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ సంస్థ నిర్మించనుంది. మొదటి రెండు సినిమాల కంటే భారీ బడ్జెట్‏తో, భారీ యాక్షన్‏తో ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. మార్చి మొదటి వారంలో ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక మార్చిలో ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభించనుంది చిత్రయూనిట్.

Also Read:

మరో ప్రాజెక్టును స్టార్ట్స్ చేయనున్న మెగా హీరో.. ఈసారి నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన తేజ్..