AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: హీరో సూర్యకు కరోనా పాజిటివ్‌.. జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచన..

Corona Virus: హీరో సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్. సూర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Corona Virus: హీరో సూర్యకు కరోనా పాజిటివ్‌.. జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచన..
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2021 | 6:38 AM

Share

Corona Virus: హీరో సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్. సూర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించినట్లు సూర్య తెలిపారు. ‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బయట పరిస్థితులు ఇంకా సాధారణ పరిస్థితి రాలేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తగు జాగ్రత్తలు పాటించాలి. కరోనా సోకిన నాకు అంకిత భావంతో చికిత్స అందిస్తున్న వైద్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొంటూ సూర్య ట్విట్ చేశారు. కాగా, సూర్య ట్వీట్‌కు రియాక్ట్ అయిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Hero Surya Tweet:

Also read:

Gold Price Today(08-02-2021): స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. . హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..