మెగాస్టార్ చెల్లెలిగా సాయి పల్లవి ఫిక్స్‌..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీబిజీ అవ్వనున్నారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న చిరు..

మెగాస్టార్ చెల్లెలిగా సాయి పల్లవి ఫిక్స్‌..!

Edited By:

Updated on: Oct 11, 2020 | 3:08 PM

Sai Pallavi Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీబిజీ అవ్వనున్నారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత మెహర్ రమేష్‌, వినాయక్‌ల దర్శకత్వంలో నటించనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లు పూర్తైన తరువాత బాబీ, త్రివిక్రమ్‌, హరీష్ శంకర్ తదితరులు లైన్‌లో ఉన్నారు. కాగా చిరు హీరోగా మెహర్ రమేష్‌ వేదాళం రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. ఇందులో చిరు చెల్లెలి పాత్రలో సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరపడం, వెంటనే సాయి పల్లవి ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం.

కాగా ఒరిజనల్‌ వేదాళంలో అజిత్‌ హీరోగా, అతడి చెల్లిలి పాత్రలో లక్ష్మీ మీనన్‌ నటించారు. ఈ మూవీలో చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక మరోవైపు చిరు సరసన హీరోయిన్‌గా పలువురితో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.

Read more:

అంపైర్ల ఫిర్యాదు.. కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌కు హెచ్చరిక

ట్రంప్ వీరాభిమాని కృష్ణ హఠాన్మరణం