హైదరాబాద్: ఆర్‌ఎక్స్-100 మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ అజయ్ భూపతిపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టడంతో సెకండ్ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఒత్తిడి ఉండటం వల్లనే అజయ్ భూపతి కూడా తన సెకండ్ మూవీ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. తొలి మూవీకి మించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని భావించడంతో మహా కథతో వస్తున్నాడు.
ఈ కథకు సంబంధించి లీకైన స్టోరీ అంటూ ఒక కథనం వైరల్ అయ్యింది. సముద్రం, స్మగ్లింగ్‌పై ఈ కథ ఉంటుదట. ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉంటారట. హీరోయిన్‌గా సమయంత అయితే, ఒక హీరో ఫిక్స్ అయ్యాడని, మరో హీరో ఇంకా నిర్ణయించబడలేదని తెలుస్తోంది.
ఈ కథలో చూపించనున్న ప్రేమ వ్యవహారం చాలా విభిన్నంగా ఉంటుందట. అయితే ఇద్దరు హీరోల పాత్రలు చాలా ఆకట్టుకుంటాయి. ఒకరు ప్రశాంతంగా ఉంటే, మరొకరు సముద్ర అలజడుల మాదిరిగా ఆవేశంగా ఉంటాడట. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీస్తుండటంతో సినిమా పేరును ‘మహా సముద్రం’ అని పెట్టాలని అనుకుంటున్నారట.