చలికి వణుకుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ టీమ్‌.. రేపటి నుంచి నీళ్లల్లో షూటింగ్‌ అంటోన్న జక్కన్న

| Edited By:

Nov 17, 2020 | 4:07 PM

దేశవ్యాప్తంగా శీతాకాలం ప్రారంభం కాగా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అందరు చలికి ఒణుకుతున్నారు.

చలికి వణుకుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌.. రేపటి నుంచి నీళ్లల్లో షూటింగ్‌ అంటోన్న జక్కన్న
Follow us on

RRR Team video: దేశవ్యాప్తంగా శీతాకాలం ప్రారంభం కాగా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అందరు చలికి ఒణుకుతున్నారు. సూర్యుడు బయటకు వస్తేనే తప్ప ఇళ్లలో నుంచి కాలు బయటకు పెట్టేందుకు కూడా చాలా మంది ధైర్యం చేయడం లేదు. ఈ క్రమంలో వాటన్నింటిని పట్టించుకోకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ని కానిచ్చేస్తున్నాడు జక్కన్న. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. మూవీ యూనిట్ మరో వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోకు చలికాలం.. చలి పనిని ఆపలేదు అన్న కామెంట్ పెట్టగా.. అందులో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ తదితర యూనిట్‌ చలికి వణుకుతూ కనిపించారు. ఇక అదే వీడియోలో రేపటి నుంచి నీళ్లలో ఉందంటూ రాజమౌళి ఎవరికో నవ్వుతూ చెబుతున్నాడు. మొత్తానికి ఈ మూవీ కోసం రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లనే కాదు మిగిలిన వారిని కూడా బాగా కష్టపెడుతున్నట్లు అర్థమవుతోంది.

కాగా రియల్‌ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. వారి సరసన ఒలివియా, అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి బ్లాక్‌బస్టర్‌ హిట్ తరువాత జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి.