జక్కన్నపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ఫిర్యాదు.. బాధ మొత్తం కక్కేసిన ఎన్టీఆర్, చెర్రీ

దర్శకధీరుడు రాజమౌళి ఇవాళ 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

జక్కన్నపై ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ ఫిర్యాదు.. బాధ మొత్తం కక్కేసిన ఎన్టీఆర్, చెర్రీ

Edited By:

Updated on: Oct 10, 2020 | 3:14 PM

HBD Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఇవాళ 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మొదలు అభిమానులు జక్కన్నకు విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి బర్త్‌డే సందర్భంగా ఆయన తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో రాజమౌళిపై పలువురు కంప్లైంట్ చేశారు. ఇక ఎన్టీఆర్, చెర్రీ, కీరవాణి అయితే తమ బాధనంతా వ్యక్తపరిచారు. అలాగే అసిస్టెంట్‌ డైరెక్టర్లు కూడా రాజమౌళి చేసే యాక్షన్లను చేసి మరీ చూపించారు. మొత్తానికి తమ బాధనంతా చెబుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ ఆయనకు స్పెషల్ విషెస్‌ని చెప్పారు.

Read More:

హెచ్చరిక.. పెళ్లి కాని మగవారికి కరోనా మరణం ముప్పు ఎక్కువ..!

Bigg Boss 4: మోనాల్‌తో అఖిల్‌ లవ్‌.. ఇంటికి రాగానే పెళ్లి చేస్తామంటోన్న తల్లి