Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Varma: ‘టక్ జగదీష్’ చాలా స్పెషల్.. నేచురల్ స్టార్ నాని గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రీతూ వర్మ

Tuck Jagadish Actress Ritu Varma: టక్ జగదీష్ మూవీలో నేచురల్ స్టార్ నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ మీడియాతో ముచ్చటించారు.

Ritu Varma: ‘టక్ జగదీష్’ చాలా స్పెషల్.. నేచురల్ స్టార్ నాని గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రీతూ వర్మ
Tuck Jagadish Actress Ritu Varma
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 08, 2021 | 3:03 PM

Tuck Jagadish Actress Ritu Varma: నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’ చిత్రాన్ని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా రీతూ వర్మ మీడియాతో ముచ్చటించారు. ‘ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లోకెల్లా ఇది ప్రత్యేకం.. పూర్తిగా కమర్షియల్ సినిమాలో నటించాను. ప్రభుత్వాధికారిగా గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్‌గా తన అధికారాన్ని చూపించే పాత్ర అది. పాత్రలో చాలా అమాయకత్వం కూడా ఉంటుంది. మనసులో ఏముంటే అదే మాట్లాడే అమ్మాయి. ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి.. తాను కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే పాత్రలో నటించా’ అని రీతూ వర్మ చెప్పారు.

‘ఇది కచ్చితంగా థియేటర్ సినిమానే.. బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్‌ను మాత్రం మిస్ అవుతాం. ఇప్పుడు ఓటీటీ కూడా మంచి ఫాంలో ఉంది. లాక్డౌన్ సమయంలో ఓటీటీ మీద మనం ఆధారపడ్డాం. అదే మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో టక్ జగదీష్ సినిమా విడుదలవుతుండటంతో ఒకేసారి ఎంతో మంది చూసే అవకాశం ఉంది’ అన్నారు రీతూ వర్మ.

‘నేను సిటీ అమ్మాయిని.. ఎప్పుడూ కూడా గ్రామాల్లోకి వెళ్లలేదు. ఉండలేదు. కానీ నేను మనుషులను ఎక్కువగా గమనిస్తుంటాను. ఎక్కడో చూసిన విషయాలు అలా గుర్తుండిపోతాయి. పైగా నేను దర్శకుడు చెప్పింది చేసే నటిని. ఈ పాత్ర కోసం శివ నిర్వాణ గారే ఇన్ పుట్స్ ఇచ్చేశారు. ఆ పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్ ధరించగానే పాత్రలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది’ అని రీతూ చెప్పారు.

‘నానితో ఇది రెండో సారి నటించడం. మొదటగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించాను. కానీ అందులో నాది చిన్న పాత్ర. అంతగా ఇంటరాక్షన్ అవ్వలేదు. నేను కూడా అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఈ సారి మాత్రం నానితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఎంతో నేర్చుకున్నాను. సినిమా, జీవితం వంటి వాటి మీద నానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నాని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. అయనెంతో సపోర్ట్ చేశారు’ అని రీతూ తెలిపారు.

Ritu Varma (10)

Ritu Varma New Photos. Credit by:Ritu Varma/Instagram

మరిన్ని అంశాలపై రీతూ వర్మ ఏమని చెప్పారో ఇక్కడ చూద్దాం..

నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నానిలో నచ్చిన విషయం అదే. ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని, టక్ జగదీష్‌లో నానికి ఉన్న వ్యత్యాసం చెప్పేంత స్థాయి నాకు లేదు. నాని నటన అంటే ఇష్టం, ఆయన ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఉంది.

టక్ జగదీష్ కమర్షియల్ సినిమా అయినా కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఓవర్ యాక్షన్, డ్రామా సీన్లు ఉండవు. సటిల్ యాక్షన్ ఉంటుంది. ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రతీ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. యూనిక్‌గా ఉంటుంది. కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ కచ్చితంగా ఉంటాయి. నిన్నుకోరి, మజిలి సినిమాలు చూసినప్పుడు శివ నిర్వాణ గారితో పని చేయాలని అనుకున్నాను. నాకు డ్రామా ఎమోషనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.

టక్ జగదీష్‌లో కామెడీ కూడా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నానికి, నాకు ఉన్న సీన్స్‌లోనూ చిరునవ్వును తీసుకొస్తుంది. టక్ జగదీష్ తరువాత ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ మూవీతో ఓ వర్గం ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాను. నేను ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్, మల్టీ ప్లెక్స్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతాను.

Ritu Varma (8)

Ritu Varma New Photos. Credit by:Ritu Varma/Instagram

ఓ నటిగా నేను భిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటాను. అయితే నా పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉందని చూస్తాను.. నా పాత్ర కథకు బలమైందిగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అంతే కానీ నేను పలాన పాత్రలను చేయను అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలను చేసేందుకు నేను సిద్దంగానే ఉన్నాను.

వరుడు కావలెను అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ద్విభాష చిత్రం ఒకే ఒక జీవితం, మరో తమిళ సినిమాకు సైన్ చేశాను. వెబ్ సిరీస్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి. నాకు డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం, ఎంజాయ్ చేసే పాత్రలను పోషించడం అంటే ఇష్టం. కానీ నాకు ఎక్కువగా అలాంటి అవకాశాలు రాలేదు. కానీ వరుడు కావలెనులో వచ్చింది.

ప్రస్తుతానికి అయితే నటన మీదే దృష్టి పెట్టాను. కానీ నాకు సినిమాలు తీయాలని ఉంది. ఓటీటీ కోసం చిన్న సినిమాలను తీయాలని అనుకుంటున్నాను. కో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను.

పెళ్లి చూపులు సినిమాతో కోలీవుడ్ కూడా నాకు మంచి స్వాగతం పలికింది. అక్కడ అంతా బాగానే ఉంది. ధృవ నక్షత్రం, కనులు కనులు దోచాయంటే సినిమాలకు తమిళంలో డబ్ చెప్పాను. కానీ హిందీ యాక్సంట్ ఉందని వద్దన్నారు. కానీ తెలుగులో మాత్రం నేనే చెప్పుకుంటాను.

Ritu Varma (5)

Ritu Varma New Photos. Credit by:Ritu Varma/Instagram

ఇప్పుడు ఆ భాష ఈ భాష అనే హద్దులు లేవు. ఇప్పుడు ఇండియన్ సినిమా అని చూస్తున్నారు. మనం కూడా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నాం.. ఇక్కడి సినిమాలను బాలీవుడ్ కూడా రీమేక్స్ చేస్తోంది. అక్కడ మంచి అవకాశాలు వస్తే చేస్తాను.

లాక్డౌన్ వల్ల దాదాపు నాలుగైదు నెలలు పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాం. నేను సాధారణంగానే పనిని ఆరాధిస్తాను. గౌరవిస్తాను. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే మనం ఈ రోజు మన వారితో సంతోషంగా ఉండాలని లాక్డౌన్‌లో నేర్చుకున్నాను.

తినడం ఇష్టం. వంటలు వండటం కూడా ఇష్టం. కానీ అప్పుడప్పుడే వండుతాను. అమ్మ మాంసాహారి, నాన్న శాకాహారి. నేను రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్తాను.. వెరైటీ ఫుడ్‌లను టేస్ట్ చేస్తుంటాను.

Also Read..

మొదలైన రాంచరణ్ – శంకర్‌ల పాన్ ఇండియా సినిమా షూటింగ్.. ఫొటోస్ చూడండి

ఆర్జీవితో బిగ్‏బాస్ బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూ.. అషు రెడ్డి మథర్ రియాక్షన్ వింటే షాకవుతారు..

Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా