
సాధరణంగా నచ్చిన హీరోయిన్స్, హీరోలకు ఇష్టమైనవి ఎంటో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయాత్నాలు చేస్తుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా తమకు ఇష్టమైన వంటకాల గురించి పలు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేను తన అభిమానులు ఇష్టమైన వంట గురించి అడుగుతుండా..సౌత్ ఇండియన్ వంటకాలలో తనకు ఇష్టమైన వంటకం చెబుతున్న వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.
సౌత్ ఇండియాలో చేసే వంటకాలలో తనకు రసం చాలా ఇష్టమని తెలిపింది. తనకు అన్నంతోపాటు రసం కలిపి తినడాన్ని తాను ఎంజాయ్ చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో తన పక్కన ఉన్న అనన్య పాండే కూడా సౌత్ ఇండియన్ వంటకాలు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకోచ్చింది.
Also Read:
Actress Shruthi haasan: హిందీ వెబ్ సిరీస్లో నటించనున్న శృతీహసన్.. మిథున్ చక్రవర్తి ప్రియురాలిగా..