ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ రిలీజ్.. నో డైలాగ్స్.. మరోసారి మ్యూజిక్‌తోనే అదరగొట్టిన డైరెక్టర్..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం రూపొందిస్తున్న చిత్రం 'డీ కంపెనీ'. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశాడు ఆర్జీవి. ఈ మూవీ తనకు డ్రీమ్
RGV D Company Movie Update: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం రూపొందిస్తున్న చిత్రం ‘డీ కంపెనీ’. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశాడు ఆర్జీవి. ఈ మూవీ తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ డీ కంపెనీ టీజర్ షేర్ చేస్తూ.. “మహా భారత్ ఇన్ అండర్ వరల్డ్” అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
తాజాగా విడుదలైన టీజర్ వీడియోలో.. డైలాగ్స్ ఏం లేకుండా ఓన్లీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో హైప్ క్రియేట్ చేశాడు వర్మ. ఇక చివర్లో మాత్రం ఒకే ఒక డైలాగ్‌ను చూపించారు. ఇందులో దావూద్ ఇబ్రహీం ఎలా అండర్ వరల్డ్ దాదాగా ఎలా మారడాన్నదే ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనిని స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్నారు.
Here’s A PEEK into D COMPANY First Look TEASER : The MAHABHARAT OF UNDERWORLD ..Produced by SPARK @SparkSagar1 it is going to tell the story of how DAWOOD IBRAHIM with his BILL GATES like vision,turned a street gang into an INTERNATIONAL ORGANISATION https://t.co/Nff1jm0TGs
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2021
Also Read:
ఆకట్టుకుంటున్న ‘నాట్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. తొలిసారి వెండితెరపై నటించనున్న కూచిపూడి డాన్సర్..