Renu Desai About Coronavirus: నేను కోవిడ్ బాధితురాలినే .. వైరస్ ప్రభావం తగ్గిందనుకోవద్దంటున్న రేణు దేశాయ్

|

Jan 08, 2021 | 2:37 PM

తనకు కూడా కోవిడ్ 19 వ్యాధి సోకినట్లు .. అయితే చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నానని నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా...

Renu Desai About Coronavirus:  నేను కోవిడ్ బాధితురాలినే ..  వైరస్ ప్రభావం తగ్గిందనుకోవద్దంటున్న రేణు దేశాయ్
Follow us on

Renu Desai About Coronavirus: కరోనా వైరస్‌కు ఎవరు అతీతం కారు.. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు అనే తేడా లేకుండా ప్రపంచమంతా కరోనా బాధితులుగా మారిపోయారు. తాజాగా తనకు కూడా కోవిడ్ 19 వ్యాధి సోకినట్లు .. అయితే చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నానని నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా దాని ప్రభావం ఇప్పుడిప్పుడే పోదని. పరిస్థితులు అలాగే ఉన్నాయని.. కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తనకు ఈ వైరస్ సోకడంతో.. షూటింగ్స్ కు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాయని.. తగిన చికిత్స తీసుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. దీంతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌కు హాజరవుతున్నాని రేణు తెలిపారు. ఇదే సమయంలో తాను మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తను ఖండించారు. తాను ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన‌ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిందని.. దీంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి కూడా ఓకే చెప్పాన‌ని పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానన్నారు.. ఇక రైతు సమస్యల మీద తాను తీయబోయాతున్న సినిమా షూటింగ్ కూడా మర్చి నెలలో మొదలు పెట్టనున్నానని చెప్పారు.

Also Read: మనం కాదనుకున్న పూర్వకాలం అలవాట్లే శ్రేయస్కరమా.. రాగినీటితో రోగాలు దూరం