Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

|

Jan 28, 2022 | 6:41 AM

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ (RRR), ప్రభాస్ రాధేశ్యామ్ (Radheshyam) లాంటి పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో భారీ చిత్రం చేరింది

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..
Vikrant Rona
Follow us on

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ (RRR), ప్రభాస్ రాధేశ్యామ్ (Radheshyam) లాంటి పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో భారీ చిత్రం చేరింది. అదే కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ (Sudeep) హీరోగా నటిస్తోన్న ‘విక్రాంత్ రోణ’  (Vikrant Rona) . హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో త్రీడి లో రూపొందించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.  మొత్తం 14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరై తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.

త్వరలోనే కొత్త తేదీతో మీ ముందుకు వస్తాం!

‘పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 24న మీ అందరినీ థియేటర్లలో కలవాలని మేం అనుకున్నా. అయితే… ప్రస్తుత కరోనా పరిస్థితులు,  కొవిడ్ ను కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడం లేదు. సినిమా కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడటం కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. అయితే.. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగా  మంచి థియేటర్ అనుభూతి ఇచ్చేందుకే మా విక్రాంత్ రోణ సిద్ధమవుతున్నాడు.  త్వరలోనే  కొత్త విడుదల తేదీతో మిమ్మల్ని కలుస్తాం’ అని ప్రకటనలో పేర్కొంది చిత్రబృందం.  కాగా ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకత్వం వహించారు. జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సుదీప్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించింది.

Also Read:83 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Parenting Tips: పసి పిల్లల పెంపకంలో తల్లులు పాటించాల్సిన జాగ్రత్తలివే ..

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!