RED movie : మంచి టాక్ తో దూసుకుపోతున్న రామ్ ‘రెడ్’ మూవీ.. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా…

కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో రామ్‌, ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమతపడ్డాడు...

RED movie : మంచి టాక్ తో దూసుకుపోతున్న రామ్ రెడ్ మూవీ.. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా...

Edited By:

Updated on: Jan 21, 2021 | 7:49 AM

RED movie : కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో రామ్‌, ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమత పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్’ అనే సినిమా చేశాడు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ థ్రిల్లర్ మంచి టాక్ తో దూసుకుపోతుంది.

ఈ చిత్రాన్ని 7 భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇంతకముందే ప్రకటించారు. కన్నడ వెర్షన్ ని తెలుగుతో పాటే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ‘రెడ్’ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలురెడ్’ సినిమా మలయాళ డబ్బింగ్ వెర్షన్ జనవరి 22న విడుదల చేయనున్నారు. అలానే హిందీ వెర్షన్ ని ఈ నెల చివరి వారంలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. బెంగాలీ – భోజ్ పురి – మరాఠీ బాషల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని చదవండి :

Lucifer Movie Update: షూటింగ్ ప్రారంభించిన మెగాస్టార్ ‘లూసిఫర్’.. చిరంజీవి కెరీర్లో 153వ చిత్రంగా రానున్న..