Shimbu Rewind Movie Teaser: తమిళ స్టార్ హీరో శింబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మానాడు’. ఇందులో శింబుకు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో వి. హౌస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 3న శింబు పుట్టినరోజు సందర్భంగా మానాడు మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాను తెలుగులో రీవైన్డ్ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు టీజర్‌ను మాస్ మాహారాజా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
టీజర్ విడుదల చేస్తూ.. రవితేజ శింబు మరియు చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు శింబు. రీవైన్డ్ టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా గ్రిప్పింగ్‌గా కనిపిస్తోంది. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు” అని రవితేజ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మానాడు టీజర్ చాలా ఆసక్తికరంగా, సరికొత్తగా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శింబు ముస్లిం వ్యక్తిగా నటిస్తున్నాడు. ఇక ఈ టీజర్లో విచిత్రం ఏంటంటే.. వీడియో మొదలైనప్పటి నుంచి అందులోని సన్నివేశాలన్ని వెనక్కి ప్లే అవుతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెంచేశారు చిత్రయూనిట్.
Happy Birthday @SilambarasanTR_ !! ?? Super happy to launch the #Rewindteaser. Looks gripping! Good luck to the entire team! @vp_offl @sureshkamatchi @thisisysrhttps://t.co/WFiTDwoJiS
— Ravi Teja (@RaviTeja_offl) February 3, 2021
రీవైన్డ్ మూవీ టీజర్..