Ravi Teja : ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న రవితేజ.. మరో సినిమాను పట్టాలెక్కించి మాస్ రాజా

ఈ ఏడాది ప్రారంభంలో `క్రాక్` సినిమాతో ఫ‌స్ట్ బ్లాక్ బస్ట‌ర్ హిట్ ను అందుకున్నారు మాస్ మ‌హారాజ ర‌వితేజ. చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడిన రవితేజ. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చారు.

Ravi Teja : ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న రవితేజ.. మరో సినిమాను పట్టాలెక్కించి మాస్ రాజా
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2021 | 4:20 PM

Ravi Teja : ఈ ఏడాది ప్రారంభంలో `క్రాక్` సినిమాతో ఫ‌స్ట్ బ్లాక్ బస్ట‌ర్ హిట్ ను అందుకున్నారు మాస్ మ‌హారాజ ర‌వితేజ. చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడిన రవితేజ. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చారు. ఇప్పుడు  మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు.   శరత్ మండవ అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నారు రవితేజ. శ‌ర‌త్ మండ‌వ మ‌న తెలుగు వారే… గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు ఈయన రచయితగా పనిచేశారు.రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుందని తెలుస్తుంది. ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నాడు  శ‌ర‌త్ మండ‌వ‌. ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా రూపొందుతోన్న ఈ మూవీ ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా (ఏప్రిల్ 13) సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. దేవుని ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి రవితేజ క్లాప్ కొట్ట‌గా, మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత ర‌విశంక‌ర్ కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌కి అంద‌జేశారు. ఇక ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. రాక్షసుడు వంటి హిట్ అందుకున్న రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna : ఈ లక్కీ బ్యూటీ టాలీవుడ్‌‌‌‌‌ను నై అని బాలీవుడ్‌‌‌‌కు సై అంటుందా..?

Khiladi​​ Movie Teaser: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మాస్ రాజా.. ఖిలాడి టీజర్‌‌‌‌తో కుమ్మేస్తున్న రవితేజ

Jwala Gutta-Vishnu Vishal: పెళ్లిపీటలెక్కనున్న బ్యాట్మెంటన్ స్టార్.. వెడ్డింగ్ డేట్ చెప్పేసిన గుత్తా జ్వాలా