
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే రష్మికకు ఈ మధ్య ఒక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రణదీప్ హూడా హీరోగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఒక కీలక పాత్రకు రష్మికను ఎంపిక చేశారని అన్నారు. ఇక ఆ ఆఫర్ తో సంజయ్ లీలా భన్సాలి టీమ్ రష్మికను సంప్రదించిన మాట నిజమే కానీ రష్మిక ఆ సినిమాకు ఎంపిక కాలేదట. కారణాలు ఇంకా తెలీదు కానీ ప్రస్తుతానికైతే మన గీతా మేడమ్ కు ఆ బాలీవుడ్ సినిమా లేనట్టే అని సమాచారం.
మరోవైపు రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు తమిళ హీరో కార్తీ సరసన కూడా ఒక చిత్రంలో నటిస్తోంది.