టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరొందిన రావు రమేష్ బంపరాఫర్ కొట్టేశారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న కేజీఎఫ్ 2లో రావు రమేష్ నటించబోతున్నారు. ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తుండగా ఈ రోజు ఆ మూవీ షూటింగ్‌లో అడుగెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ‘‘రావు రమేష్ గారికి స్వాగతం. ఇందులో మీ పాత్ర గురించి ఊహాగానాలు ప్రేక్షకులకే వదిలేస్తున్నా. మిమ్మల్ని తెరపై చూసిన తరువాత వారికి తెలుస్తుంది. కేజీఎఫ్ 2లో మీరు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ ట్వీట్ చేశారు.
Welcome on board Rao Ramesh sir.
We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen.
Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm— Prashanth Neel (@prashanth_neel) February 10, 2020
యశ్ హీరోగా కేజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ 2018లో ఘన విజయం సాధించిన కేజీఎఫ్ సీక్వెల్‌గా రాబోతోంది. అందులో నటించిన శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, మాలవికా అవినాశ్ తదితరులు ఈ భాగంలో కొనసాగుతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులైన సంజయ్ దత్, రవీనా టాండెన్‌లు సీక్వెల్‌లో భాగం అవ్వడంతో.. కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. విజయ్ కిర్గందుర్ నిర్మిస్తున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. ఈ ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ సీక్వెల్‌పై కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీలో భారీ అంచనాలు ఉన్నాయి.