1983ప్రపంచకప్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న చిత్రం 83. ఇందులో అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతుండగా.. తాజాగా రణ్వీర్ పుట్టినరోజు కావడంతో అతడికి చెందిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో కపిల్ దేవ్లా ఆకట్టుకుంటున్నాడు రణ్వీర్. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్ అచ్చు కపిల్ దేవ్లానే ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో కపిల్ దేవ్ భార్య రోమి దేవ్ పాత్రలో దీపికా నటిస్తోంది. వివాహం తరువాత రణ్వీర్, దీపికా కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే జీవా, పంకజ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్, సకీబ్ సలీమ్, నవాజుద్దీన్ సిద్దిఖ్వీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విష్ణు ఇందూరి, మధు మంతెన, కబీర్ ఖాన్, సాజిద్ నడియావాలా, దీపికా పదుకొనే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.