AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Dancer : రాను బొంబాయికి రాను పాట వల్ల ఫేమ్ వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. ఫోక్ డ్యాన్సర్ లిఖిత..

రాను ముంబైకి రాను పాటతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లిఖిత, సోషల్ మీడియా నుండి హీరోయిన్‌గా మారుతుంది. ప్రస్తుతం ఆమె సావిత్రి V3 చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. ఆమె సినీ ప్రయాణం, సాయి పల్లవి స్ఫూర్తి, రాను ముంబైకి రాను పాట పారితోషికంపై గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Folk Dancer : రాను బొంబాయికి రాను పాట వల్ల ఫేమ్ వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. ఫోక్ డ్యాన్సర్ లిఖిత..
Likhita
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2026 | 1:34 PM

Share

రాను ముంబైకి రాను అనే ఫోక్ సాంగ్ తెలుగు రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ పాటలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న లిఖిత, ఇప్పుడు సావిత్రి V3 చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు వెండితెరకు అరంగేట్రం చేస్తున్నారు. టిక్‌టాక్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన లిఖిత, బ్యాన్ అనంతరం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపైకి మారారు. డ్యాన్స్ నేర్పించే సాయి కృష్ణ మాస్టర్ మార్గదర్శకత్వంలో, రీల్స్, డ్యాన్స్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నుండి సినీ హీరోయిన్‌గా మారింది. తాను హీరోయిన్ కావాలనే కాకుండా, ఒక మంచి ఆర్టిస్ట్‌గా, బలమైన పాత్రలు చేయాలనే కోరికతో ఈ సినీ రంగంలోకి ప్రవేశించానని లిఖిత వెల్లడించారు. సావిత్రి V3 చిత్రంలో అవకాశం రావడాన్ని ఒక మంచి నటిగా పేరు తెచ్చుకోవడానికి ఒక వేదికగా ఆమె భావిస్తున్నారు.

తన జీవితంలో తొలి సంపాదన కేవలం రూ.1500 అని గుర్తుచేసుకుంటూ, నేడు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని లిఖిత తెలిపారు. ఈ ప్రయాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నప్పుడు డ్యాన్స్, సోషల్ మీడియా కార్యకలాపాలను నిలిపివేయమని కుటుంబ సభ్యులు కోరడం తనను నిరాశపరిచిందని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ, తల్లిదండ్రులు తన ఆసక్తిని అర్థం చేసుకోవడంతో, చదువుతో పాటు డ్యాన్స్ లోనూ కొనసాగగలిగారు. 10వ తరగతిలో 8.2 లేదా 8.3 గ్రేడ్ పాయింట్లు సాధించానని ఆమె పేర్కొన్నారు.

అయితే, రాను ముంబైకి రాను పాట విజయం, దానితో ముడిపడి ఉన్న పారితోషికం గురించి లిఖిత స్పందించారు. 86 కోట్ల వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటకు సంబంధించి రాము రాథోడ్ నుండి తనకు అదనపు మొత్తం అందలేదని, భవిష్యత్తులో “ఒక సర్ప్రైజ్” ఉంటుందని మాత్రమే చెప్పారని ఆమె తెలిపారు. రాము రాథోడ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ పాట ద్వారా రాము రాథోడ్ కోటి రూపాయలకు పైగా సంపాదించారని, ఇళ్ళు, కార్లు కొన్నారని రూమర్స్ వినిపించాయని.. అప్పుడు తనకు కూడా కాస్త అదనపు పారితోషికం దక్కి ఉంటే బాగుండేదని ఆమె పేర్కొన్నారు. రాము రాథోడ్‌తో తన బంధం “బ్రదర్ అండ్ సిస్టర్” లా ఉందని, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చాలా సరదాగా ఉంటుందని ఆమె వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us