పునః ప్రారంభమైన ‘రంగ్‌దే’ షూటింగ్‌

టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఎప్పుడో ప్రారంభం కాగా.. ఒక్కొక్కరుగా సెట్స్‌పైకి వెళుతున్నారు. తాజాగా నితిన్ కూడా తన షూటింగ్‌ని ప్రారంభించేశారు.

పునః ప్రారంభమైన రంగ్‌దే షూటింగ్‌

Edited By:

Updated on: Sep 23, 2020 | 4:51 PM

Rang De Shooting: టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఎప్పుడో ప్రారంభం కాగా.. ఒక్కొక్కరుగా సెట్స్‌పైకి వెళుతున్నారు. తాజాగా నితిన్ కూడా తన షూటింగ్‌ని ప్రారంభించేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ రంగ్‌దేలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అన్నీ జాగ్రత్తలతో షూటింగ్‌ని ప్రారంభించామని సంక్రాంతికి విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.

కాగా రొమాంటిక్ ప్రేమ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్‌ నటిస్తోంది. నరేష్‌, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

Bigg Boss 4: వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న బబ్లీ హీరోయిన్‌..!

Breaking: భారత్‌కి రాకపోకలను నిషేధించిన దుబాయి

https://twitter.com/SitharaEnts/status/1308688486132674561/photo/2