Bigg Boss 4: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న బబ్లీ హీరోయిన్..!
బిగ్‌బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి వారం కాస్త సోసోగా నడిచినప్పటికీ.. రెండో వారం నుంచి కంటెస్టెంట్‌ల
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి వారం కాస్త సోసోగా నడిచినప్పటికీ.. రెండో వారం నుంచి కంటెస్టెంట్‌ల మధ్య అసలు పోరు ప్రారంభం అయ్యింది. ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు పోటీపోటీగా ఆడుతున్నారు. ఇక మంగళవారం ఉక్కు హృదయం టాస్క్‌లో భాగంగా మనుషులు- రోబోల మధ్య జరిగిన యుద్ధం వీక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మరింత పెంచేందుకు ఇప్పుడు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మరో బబ్లీ హీరోయిన్‌ని హౌజ్‌లోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు హీరోయిన్ యామినీ భాస్కర్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉందని.. పరిస్థితులు, ఆమె కరోనా ఫలితాలను బట్టి నాలుగు లేదా ఐదో వారంలో యామిని హౌజ్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కాగా కొత్తగా మా ప్రయాణం, కీచక, భలే మంచి చౌకబేరమ్, నర్తనశాల వంటి చిత్రాల ద్వారా యామిని భాస్కర్ తెలుగు ప్రేక్షకులను దగ్గరైన విషయం తెలిసిందే.
Read More:
Breaking: భారత్‌కి రాకపోకలను నిషేధించిన దుబాయి
పెళ్లిపై అభిమాని ప్రశ్న.. డైరెక్ట్‌గా వచ్చి కలిస్తే చెప్తానన్న నటి