కంగనకు రణ్‌బీర్ కౌంటర్..!

మణికర్ణిక సక్సెస్‌మీట్‌లో నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రణ్‌బీర్ కపూర్. తాను ఏం మాట్లాడాలో తనకు తెలుసన్నారు. తనను ఎవరైనా ప్రశ్నించినప్పుడు సాధ్యమైనంతవరకూ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానన్నారు. కానీ.. తనకు రాజకీయాలపై అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇచ్చే ఆసక్తి లేదన్నారు. వివాదాల్లో చిక్కుకోవడం తనకు ఇష్టం లేదన్నారు రణ్‌బీర్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారికి నచ్చినట్టు కామెంట్లు చేయోచ్చని, వారి అభిప్రాయాల్ని చెప్పొచ్చన్నారు. తన ఇంటికి వాటర్, కరెంట్ సరఫరా సరిగ్గా జరుగుతోందని.. అలాంటప్పుడు […]

కంగనకు రణ్‌బీర్ కౌంటర్..!

Edited By:

Updated on: May 13, 2019 | 1:27 PM

మణికర్ణిక సక్సెస్‌మీట్‌లో నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రణ్‌బీర్ కపూర్. తాను ఏం మాట్లాడాలో తనకు తెలుసన్నారు. తనను ఎవరైనా ప్రశ్నించినప్పుడు సాధ్యమైనంతవరకూ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానన్నారు.

కానీ.. తనకు రాజకీయాలపై అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇచ్చే ఆసక్తి లేదన్నారు. వివాదాల్లో చిక్కుకోవడం తనకు ఇష్టం లేదన్నారు రణ్‌బీర్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారికి నచ్చినట్టు కామెంట్లు చేయోచ్చని, వారి అభిప్రాయాల్ని చెప్పొచ్చన్నారు.

తన ఇంటికి వాటర్, కరెంట్ సరఫరా సరిగ్గా జరుగుతోందని.. అలాంటప్పుడు రాజకీయాలపై ఎందుకు కామెంట్లు చేయాలని ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ సమాధానమిచ్చారు. దీనిపై కంగనా మాట్లాడుతూ రణ్‌బీర్‌కు ఓ పౌరుడిగా బాధ్యత లేదని విమర్శించింది.

Follow Us