AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana: ‘తగ్గడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్‌’.. నెటిజన్‌ అత్యుత్సాహానికి అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన రానా..

Rana: రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'విరాట పర్వం'. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జూన్‌17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్‌...

Rana: 'తగ్గడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్‌'.. నెటిజన్‌ అత్యుత్సాహానికి అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన రానా..
Narender Vaitla
|

Updated on: Jun 03, 2022 | 9:56 PM

Share

Rana: రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జూన్‌17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగానే తాజాగా సినిమా ట్రైలర్‌ తేదీని ప్రకటించారు. జూన్‌5వ తేదీని ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఉదయం సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ సందర్భంగా పోస్ట్‌ చేసిన ఫొటో చర్చకు దారి తీసింది. ఈ ఫొటోలో సాయి పల్లవి, రానాను హత్తుకున్నట్లు చూపించారు. అయితే రానా ఫేస్‌ కనిపించకుండా మేకర్స్‌ ఫొటోను డిజైన్‌ చేశారు.

దీంతో ఈ ఫొటోను ఓ నెటిజన్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘సొంత నిర్మాణ సంస్థలోనే ఫేస్‌ తీసేశారు. మిగతా వారు వేలెత్తి చూపడంలో తప్పేముంది. తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడం, అందరికీ లోకువ అవడం రానా స్టైల్‌’ అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. దీంతో దీనిపై రానా తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయమై రానా.. ‘మనం తగ్గి.. కథ, నాయికను ఎలివేట్‌ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్‌. సొంత బ్యానర్‌ కదా గొప్పవన్నీ ఇక్కడే చేయొచ్చు’ అని రానా రిప్లై ఇచ్చారు. రానా ఇచ్చిన ఈ రిప్లైకు అభిమానులు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నారు. బాగా సమాధానం ఇచ్చారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?