దగ్గుబాటివారబ్బాయి..అస్సలు తగ్గట్లేదుగా

|

May 15, 2019 | 12:04 PM

రానా దగ్గుబాటి..ఈ హీరో..సారీ..సారీ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే మన భల్లాల దేవుడు ఎప్పుడూ హీరో అనే చట్రంలో ఇరుక్కుపోలేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ‘లీడర్’ మూవీతో  సోషల్ సబ్జెక్ట్‌తో టచ్ చేసిన రానా..ఆ తర్వాత ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోన్నాడు . అంతేకాదు క్యారక్టర్‌కు తగ్గట్టూ తనని తాను మలుచుకుంటూ బెస్ట్ నటుడిగా అదరగొడుతున్నాడు. బాహుబలి కోసం భారీగా బరువు […]

దగ్గుబాటివారబ్బాయి..అస్సలు తగ్గట్లేదుగా
Follow us on

రానా దగ్గుబాటి..ఈ హీరో..సారీ..సారీ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే మన భల్లాల దేవుడు ఎప్పుడూ హీరో అనే చట్రంలో ఇరుక్కుపోలేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ‘లీడర్’ మూవీతో  సోషల్ సబ్జెక్ట్‌తో టచ్ చేసిన రానా..ఆ తర్వాత ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోన్నాడు . అంతేకాదు క్యారక్టర్‌కు తగ్గట్టూ తనని తాను మలుచుకుంటూ బెస్ట్ నటుడిగా అదరగొడుతున్నాడు. బాహుబలి కోసం భారీగా బరువు పెరిగి కండలు పెంచిన రానా..ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పాత్ర కోసం అమాంతం సన్నబడ్డాడు. తాజాగా ‘హథీ మేరే సాథీ’ కోసం పూర్తిగా రఫ్ లుక్‌లోకి మారిపోయాడు.

తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ సినిమా చేస్తున్నాడు రానా. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా ఈ సినిమా లొకేషన్ నుండి రానా పిక్ ఒకటి లీక్ అయ్యింది. పొడవాటి గోనెసంచి లాంటి  లూజు షర్టు, తెల్ల వెంట్రుకలున్న గెడ్డం, రింగుల జుట్టు, కళ్ళజోడుతో డీ గ్లామర్ రగ్ లుక్‌‌లో ఉన్నాడు. ఈ లుక్‌లో రానాని చూసిన వాళ్ళంతా అతని మేకోవర్‌కి ఫిదా అవుతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాలో రానాకీ ఒక ఏనుగుకి మధ్య ఉండే రిలేషన్‌ని చక్కగా చూపించనున్నారట. ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి రానా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రానా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో  చెయ్యబోయే ‘విరాట పర్వం 1992’ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది.