లాక్‌డౌన్‌లో 15 స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసిన రామ్..!
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఓ వైపు కొత్తగా వస్తోన్న యంగ్ హీరోలు సైతం దూసుకుపోతున్న వేళ
Ram Next movie news: ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఓ వైపు కొత్తగా వస్తోన్న యంగ్ హీరోలు సైతం దూసుకుపోతున్న వేళ.. తన బ్రాండ్‌ని కాపాడుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొహమాటానికి పోకుండా నచ్చితేనే సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ వేళ దాదాపుగా 15కు పైగా స్క్రిప్ట్‌లను రామ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ( కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,440 కొత్త కేసులు.. 5 మరణాలు)
లాక్‌డౌన్ ముందు కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ రెడ్ మూవీలో నటించారు. కోలీవుడ్‌లో విజయం సాధించిన తాడమ్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇక లాక్‌డౌన్ వేళ ఈ మూవీ ఓటీటీలో విడుదల అవుతుందని పుకార్లు చాలా వచ్చినప్పటికీ.. వాటన్నింటిని టీమ్ పలుమార్లు ఖండించింది. కాగా లాక్‌డౌన్ వేళ ఇంటి పట్టునే ఉన్న అందరూ హీరోలు స్క్రిప్ట్‌లు వింటూ తమ తదుపరి సినిమాలను కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఇద్దరు రామ్‌లు(రామ్ చరణ్ కూడా) మాత్రమే ఇంతవరకు తమ తదుపరి ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు. రామ్ చరణ్ గురించి పక్కనపెడితే.. రామ్ ఈ లాక్‌డౌన్‌లో చాలా స్క్రిప్ట్‌లే విన్నారట. పలువురు దర్శకులు ఇతడితో సినిమా తీసేందుకు ఆసక్తితో స్క్రిప్ట్‌లు వినిపించారట. కానీ అవేవీ రామ్‌కి పెద్దగా నచ్చలేదట. దీంతో ఎవ్వరికీ ఓకే చెప్పనట్లు సమాచారం. ( అందుకే సినిమాల్లోకి వచ్చా.. అసలు కారణం చెప్పుకొచ్చిన సూర్య)
కాగా ఇదిలా ఉంటే త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ( Bigg Boss 4: కలిసిపోయిన మోనాల్-అఖిల్.. అసలు రీజన్ చెప్పిన అఖిల్)