హైదరాబాద్: రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 18న విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా హీరో రామ్ ఇప్పటికే సినిమా గురించి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇక తాజాగా రామ్.. పూరి జగన్నాధ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. ‘ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశాను. దీనెమ్మా కిక్కు.. ఈ పాత్రను పోషించినప్పుడు గానీ, ఆ పాత్రను స్క్రీన్ మీద చూసినప్పుడు గాని.. నాకు ఇచ్చిన కిక్కు.. ఈ మధ్య కాలంలో నాకు ఏ సినిమా ఇవ్వలేదు. థ్యాంక్యూ పూరిగారు. మీరు డ్రగ్ లాంటి వారు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనపించబోతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Just watched #iSmartShankar …”Dhenaaammmaa kickuu!!!“ …the high I got while playing this character and watching him onscreen! Ageeesss since I even watched a film that gave me such a kick! Thank You @purijagan garu! Not many realise that YOU ARE THE DRUG! #love
-R.A.P.O— RAm POthineni (@ramsayz) July 11, 2019