Bheemla Nayak: పవన్.. మీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయండి.. భీమ్లా నాయక్ సినిమాపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ..

|

Jan 31, 2022 | 11:53 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pavan kalyan), దగ్గుబాటి రానా (Daggubati Rana) నటించిన చిత్రం 'భీమ్లానాయక్' (Bheemla nayak). సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే విడుదల తేదీ మళ్లీ మారవచ్చని, రిలీజ్  ఇంకా ఆలస్యం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Bheemla Nayak: పవన్.. మీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయండి.. భీమ్లా నాయక్ సినిమాపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ..
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pavan kalyan), దగ్గుబాటి రానా (Daggubati Rana) నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’ (Bheemla nayak). సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే విడుదల తేదీ మళ్లీ మారవచ్చని, రిలీజ్  ఇంకా ఆలస్యం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  కాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘భీమ్లానాయక్’ సినిమాపై వరుస ట్వీట్లు చేశారు. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని పవన్ కల్యాణ్ ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. ‘ పవన్ కల్యాణ్ గారూ.. భీమ్లానాయక్ సినిమాను  ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యండి.. మీ పవర్ ప్రూవ్ చేయండి . పుష్ప సినిమాయే అంత చేస్తే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్  మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా వేరే హీరో అభిమానులకు సమాధానం చెప్పలేం.   మీ తర్వాత వచ్చిన  తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు.   కాబట్టి  దయచేసి మీరు కూడా  భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లండి.  మీరే సబ్‌కా బాప్ అని  నిరూపించుకోండి’ అని ఆర్జీవీ రాసుకొచ్చారు.

‘భీమ్లానాయక్’ సినిమాలో నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించనున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి  ఆర్జీవీ  చేసిన పోస్ట్ ల పై కొందరు పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Also read:NHM Jobs in Telangana: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.. తెలంగాణలో 29 మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే

Budget 2022: ఆత్మ నిర్భర్‌ భారత్‌లో మహిళల పాత్ర కీలకం.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి

NHM Jobs in Telangana: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.. తెలంగాణలో 29 మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే