మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చిరుకు జంటగా కాజల్ నటిస్తుంది. చిరంజీవి సొంత ప్రొడక్షన్ కంపెనీ కొణిదెల, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నట్లుగా అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. తాజాగా అదే విషయం గురించి మరో సారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు చరణ్ చేస్తున్న పాత్ర ఈ సినిమాలో పూర్తి స్థాయిలోనే ఉంటుందని సమాచారం. అంటే సినిమా పూర్తిగా ఒకే తెరపై తండ్రీ తనయులిద్దరినీ కలిపి చూసే అవకాశం రానుండడంతో మెగా ప్యాన్స్ కోరిక తీరబోతున్నట్లుగానే ఉంది. ఇక లాక్డౌన్ అనంతరం ఇటీవలే చిరంజీవి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా.. చరణ్ వచ్చే నెల నుంచి ఈ మూవీ చిత్రీకరణలో పాల్గోనే అవకాశాలున్నాయి.