AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : పెద్ది సినిమాలో అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ రీక్రియేట్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..

మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సంచలనం తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా పెద్ది ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీపై చరణ్ చేసిన పలు కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Peddi Movie : పెద్ది సినిమాలో అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ రీక్రియేట్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2026 | 1:35 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా పెద్ది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ ఈ సినిమాను జూన్ 4న రిలీజ్ చేయనున్నారు. ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. మరోవైపు యూట్యూబ్, సోషల్ మీడియాలో పెద్ది సాంగ్స్ దూసుకుపోతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్ది ఈవెంట్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అలాగే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ ఈ చిత్రంలో రీక్రియేట్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్ పై స్పందించిన రామ్ చరణ్ అసలు విషయం చెప్పేశారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

“మీరు కొన్ని విషయాలు బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. మేం ఆ పాటను రీక్రియేట్ చేయలేదు. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. అలాంటివి అన్నీ యాడ్ చేస్తే ఇది మరీ కమర్షియల్ సినిమా అవుతుంది. అది ఐకానిక్ సాంగ్” అని చెప్పుకొచ్చారు చరణ్. అలాగే “క్రీడలపై పూర్తి ఫోకస్ తో ఉంటూ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు దీనిని కచ్చితంగా చూడాలి. థియేటర్ నుంచి భావోద్వేగంతో బయటకు వస్తారు. వీక్ మైండ్ ఉన్నవాళ్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఆలోచించడం ప్రారంభిస్తారు. జీవితంలో అత్యంత కష్టమైన సమయాలను ఎలా ఎదుర్కోవాలో అనేదానిపై స్పష్టమైన ఆలోచన వస్తుంది. మనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా జీవితం ముందుకు సాగిపోవాలి అని పెద్ది మనకు నేర్పిస్తాడు” అంటూ చెప్పుకొచ్చారు చరణ్.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

చరణ్ మాట్లాడుతూ తన తండ్రి చిరంజీవిని చూసి తాను ఎంతో స్పూర్తి పొందానని… ఆయన లేకపోతే తన జీవితమే లేదన్నారు. అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ ను చూసి అనేక విషయాలు తెలుసుకున్నానన.. ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు చరణ్. ప్రస్తుతం చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us