RRR Movie: ‘అందరికీ థ్యాంక్స్‌ చెబుతా, ఒక్క ఎన్టీఆర్‌కి తప్ప.. ఎందుకంటే’. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చరణ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌..

RRR Movie: చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఆర్‌ఆర్ఆర్‌తో మరో భారీ మల్టీస్టారర్‌ సినిమాకు బీజం పడింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లాంటి అగ్ర హీరోలు కలిసి నటించడంతో ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ సినిమాపై పడింది...

RRR Movie: అందరికీ థ్యాంక్స్‌ చెబుతా, ఒక్క ఎన్టీఆర్‌కి తప్ప.. ఎందుకంటే. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చరణ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌..

Updated on: Dec 28, 2021 | 7:30 AM

RRR Movie: చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఆర్‌ఆర్ఆర్‌తో మరో భారీ మల్టీస్టారర్‌ సినిమాకు బీజం పడింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లాంటి అగ్ర హీరోలు కలిసి నటించడంతో ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ సినిమాపై పడింది. ఈ సినిమా ద్వారా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య మంచి స్నేహ బంధం విషయం ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ మూడేళ్లకుపైగా షూటింగ్ జరుపుకోవడంతో చెర్రీ, ఎన్టీర్‌ల మధ్య బంధం మరింత బలంగా మారిందని చెప్పాలి. తాజాగా సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చరణ్‌ చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి ప్రతీకగా నిలిచింది.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘నేను అందరికీ ధన్యవాదాలు చెప్తాను. కానీ తారక్‌కు మాత్రం చెప్పను. ఎందుకంటే నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఇటువంటి సోదరుడిని ఇచ్చినందుకు ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్తే ఈ రిలేషన్ ఇక్కడే ముగిసిపోతుందేమో అని భయంగా ఉంది. తారక్ ఎప్పటికీ నా మనసులో ఉంటాడ’ని ఎన్టీఆర్‌పై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు చరణ్‌. ఇక లైకా ప్రొడక్షన్స్‌తో ఎప్పటినుంచో పని చేయాలనుకున్నానని చెప్పుకొచ్చిన చెర్రీ.. ఆర్ఆర్ఆర్‌తో అది సాధ్యమైందన్నారు. రాజమౌళి గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ సరిపోదని, తనకు నాకు ఎన్టీఆర్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరూ సొంతంగా తమిళంలో డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు తొలుత ఈ విషయంలో భయం వేసిందని, వేరే భాషలో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అని నా భయం. కానీ మదన్ కార్కీ వల్ల డబ్బింగ్ సులభం అయింది. ఆయన ఒప్పుకుంటేనే ఆరోజు డబ్బింగ్ పూర్తయ్యేదని చరణ్‌ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Viral Video: స్పీడ్‌లో నీకు సాటిలేదు.. ప్రభుత్వోద్యోగి పనికి అంతా ఫిదా.. ప్రైవేటీకరణ ప్రభావం అంటోన్న నెటిజన్లు..!

తొలి ఓవర్‌లోనే వికెట్‌.. బౌలర్ సంబురాలకు అంతేలేదు.. ఆపై 4 ఓవర్లలో సీన్ రివర్స్.. చెత్త రికార్డుతో సంచలనం ..!

Astro Tips: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..!