తనపై వస్తున్న రూమర్స్ పై స్పంధించిన టాప్ హీరోయిన్.. ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్ ఇవ్వలేదు అంటూ..

ఇటీవల తనపై వస్తున్న రూమర్లపై స్పందించింది రకూల్ ప్రీత్ సింగ్. అక్కినేని సమంత వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఓటీటీ వేదిక "ఆహ"లో ఆమె 'సామ్ జామ్' అనే ప్రోగ్రాం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తనపై వస్తున్న రూమర్స్ పై స్పంధించిన టాప్ హీరోయిన్.. ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్ ఇవ్వలేదు అంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2020 | 4:40 PM

ఇటీవల తనపై వస్తున్న రూమర్లపై స్పందించింది రకూల్ ప్రీత్ సింగ్. అయితే ఓటీటీ వేదిక “ఆహ”లో అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ‘సామ్ జామ్’ అనే ప్రోగ్రాం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో సెలబ్రెటీస్‏ను ఆహ్వనించి వారితో కలిసి ముచ్చుట్లు పెడుతుంది సమంత. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. ఈ క్రమంలో తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో మీపై వస్తున్న వార్తలపై మీరు ఎందుకు స్పందించరు.? అని సమంత అడగ్గా.. రకుల్ స్పందించింది. “మనపై పుకార్లు సృష్టించేవారు మనగురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్‏గా ప్రచారం చేస్తున్నారు. నాకు ఎవరో ఇల్లు గిప్ట్ ఇస్తే.. నేనెందుకు ఇంత కష్టపడుతూ పనిచేస్తా.. ఆ అవసరం ఏంటీ? ఇలాంటి రూమర్స్ రావడం ఇది మొదటి సారి కాదని చాలా సార్లు వచ్చాయని తెలిపింది. అందుకే తన పై వచ్చే రూమర్స్‏ని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను. మనం చేసే పని మాత్రమే మాట్లాడుతుంది” అని రకుల్ తెలిపింది.