AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకేంద్రుడి కొత్త ‘పెళ్లిసందడి’లో కీలక పాత్రలో హీరో శ్రీకాంత్.. ఆ రోల్ కోసమే తీసుకున్నారా..?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కస్తున్న సినిమా పెళ్ళిసందడి. గతంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్ళిసందడి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.  శ్రీకాంత్ నటించిన పెళ్ళిసందడి సినిమా బ్లాక్ బాస్టర్  హిట్ అయిన విషయం తెలిసిందే.

దర్శకేంద్రుడి కొత్త 'పెళ్లిసందడి'లో కీలక పాత్రలో హీరో శ్రీకాంత్.. ఆ రోల్ కోసమే తీసుకున్నారా..?
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2020 | 4:47 PM

Share

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కస్తున్న సినిమా పెళ్ళిసందడి. గతంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్ళిసందడి’ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళిసందడి’ సినిమా బ్లాక్ బాస్టర్  హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పడు దర్శకేంద్రుడు తెరకెక్కిస్తున్న’పెళ్ళిసందడి’లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారని తెలుస్తుంది. ఒక హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మాళవిక నాయర్ ను ఎంపిక చేసారని వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంలో క్లారిటీ రాలేదు.

మరో హీరోయిన్ గా  కొత్త అందాన్ని అన్వేషిస్తున్నారట చిత్రయూనిట్. ఇక ఈ మూవీలో హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. రాఘవేంద్ర రావు నిర్మాణంలో ఈ సినిమాను తనికెళ్ల భరణి తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీకాంత్ స్పెషల్ రోల్ ను ‘పెళ్లిసందడి’ సినిమాలో చేసినట్లయితే తండ్రి కొడుకుల సినిమాగా మంచి పబ్లిసిటీ దక్కే అవకాశం ఉందంటున్నారు. అయితే శ్రీకాంత్  ఈ సినిమాలో రోషన్ తండ్రిగా కనిపిస్తాడని అంటున్నారు. రియల్ తండ్రీకొడుకులు రీల్ లోకూడా తండ్రీకొడుకులుగా నటించి మెప్పించబోతున్నారని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది అధికారప్రకటన వస్తే  కానీ తెలీదు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్