కొత్తగా కనిపించనున్న రకుల్

నాగార్జున నటిస్తోన్న ‘మన్మధుడు2’లో ఛాన్స్ కొట్టేసింది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రకుల్ కొత్తగా కనిపించనుందట. స్టార్ట్ గర్ల్‌గా ఆమె కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రను చాలా కొత్తగా రాసుకున్న రాహుల్ రవీంద్రన్, అందుకు రకుల్ కచ్చితంగా న్యాయం చేయగలదని ఆమెను ఎంపిక చేశాడట. మరోవైపు ఈ పాత్ర తన కెరీర్‌లో […]

కొత్తగా కనిపించనున్న రకుల్

Edited By:

Updated on: Mar 21, 2019 | 2:26 PM

నాగార్జున నటిస్తోన్న ‘మన్మధుడు2’లో ఛాన్స్ కొట్టేసింది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రకుల్ కొత్తగా కనిపించనుందట. స్టార్ట్ గర్ల్‌గా ఆమె కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పాత్రను చాలా కొత్తగా రాసుకున్న రాహుల్ రవీంద్రన్, అందుకు రకుల్ కచ్చితంగా న్యాయం చేయగలదని ఆమెను ఎంపిక చేశాడట. మరోవైపు ఈ పాత్ర తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని రకుల్ కూడా భావిస్తోందట. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇటీవల వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్న నాగార్జున, ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.