AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాయం వల్ల గ్యాప్.. ఏడాదిన్నర తర్వాత జిమ్‌లో అడుగుపెట్టిన భామ.. వీడియో వైరల్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణించి..ఆ తర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. తెలుగులో తోపు హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

గాయం వల్ల గ్యాప్.. ఏడాదిన్నర తర్వాత జిమ్‌లో అడుగుపెట్టిన భామ.. వీడియో వైరల్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 07, 2026 | 12:03 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణించి.. ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. తెలుగులో తిరుగులేని హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. దాంతో కొందరు సీనియర్ హీరోయిన్స్ కు అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. దాంతో కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. మరికొంతమంది ఇతర బిజినెస్ ల్లో రాణిస్తున్నారు. ఈ హీరోయిన్ కూడా టాలీవుడ్ లో తోపు హీరోయిన్ గా మెప్పించింది. ఇప్పుడు సినిమాలు లేక ఇలా సైలెంట్ అయ్యింది. అయితే ఆమె దాదాపు ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్లు మొదలు పెట్టింది. జిమ్ లో కష్టపడుతూ కనిపించింది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

ఆ అందాల భామ మరెవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది, ఇది తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది. ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

ప్రస్తుతం రకుల్ తెలుగులో సినిమాలు తాగించింది. బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. కాగా మొన్నామధ్య తీవ్రమైన నడుము నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో వర్కౌట్స్ ఆపేసింది రకుల్. తాజాగా ఏడాదిన్నర తర్వాత జిమ్ లో తిరిగి వర్కౌట్స్ మొదలు పెట్టింది. నడుముకు బెల్ట్ పెట్టుకొని కసరత్తులు చేసింది ఈ చిన్నది. వైద్యుల సలహా మేరకే సేఫ్టీ గేర్‌తో మళ్లీ వర్కవుట్స్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చింది రకుల్.

నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us