Rakul In May Day: ‘మే డే’ సినిమా షూటింగ్‌లో రకూల్ బిజీ బిజీ.. తన ఫస్ట్ డే షూటింగ్ గురించి ఏం చెప్పిందంటే..

|

Jan 03, 2021 | 2:46 PM

Rakul In May Day: టాలీవుడ్‌లో అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న రకూల్ ప్రీత్‌సింగ్ ఇటు టాలీవుడ్‌, అటు హిందీలోను వరుసగా సినిమాలు

Rakul In May Day: మే డే సినిమా షూటింగ్‌లో రకూల్ బిజీ బిజీ.. తన ఫస్ట్ డే షూటింగ్ గురించి ఏం చెప్పిందంటే..
Follow us on

Rakul In May Day: టాలీవుడ్‌లో అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న రకూల్ ప్రీత్‌సింగ్ ఇటు టాలీవుడ్‌, అటు హిందీలోను వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవల కరోనాకు గురై కోలుకున్న రకూల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ హ్యాపీగా జరుపుకుంటోంది. బిగ్‌ బి అమితాబ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా ‘మే డే’. ఈ మూవీకి ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అంగీరా ధార్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధమైన పంజాబీ భామ తన ఫస్ట్ డే షూటింగ్ గ్లింప్స్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మేడే హ్యాపీయెస్ట్ వర్క్’ అంటూ షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న బూమరాంగ్ వీడియోను షేర్ చేసింది. అజయ్ దేవగణ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మే డే’ సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదల కానుండగా, ఈ ఇద్దరు ఇదివరకు ‘దే దే ప్యార్ దే’లో కలిసి నటించారు. ఇక బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించిన ‘షిమ్లా మిర్చి’లో చివరిసారి కనిపించిన రకుల్ ప్రస్తుతం మేడే చిత్రంతో పాటు జాన్ అబ్రహంతో కలిసి ‘అటాక్’, అర్జున్ కపూర్‌తో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.