ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్.. ఆ స్టార్ హీరోతో నాకు ఒప్పందం ఉంది అంటున్న బ్యూటీ..

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అటు తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ స్టార్ హీరోతో తనకు ఒక డీల్ ఉంది అంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈ అమ్మడు.

  • Rajitha Chanti
  • Publish Date - 10:03 pm, Sat, 23 January 21
ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్.. ఆ స్టార్ హీరోతో నాకు ఒప్పందం ఉంది అంటున్న బ్యూటీ..

Heroine Rakul preeth singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అటు తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ స్టార్ హీరోతో తనకు ఒక డీల్ ఉంది అంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈ అమ్మడు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘అయలాన్’ సినిమా గురించి చెబుతూ.. ఆ సినిమా హీరో శివ కార్తికేయతో తనకు ఓ ఒప్పందం ఉందని తెలిపింది.

“కరోనా ప్రభావంతో గతేడాది ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇటీవలే తిరిగి ఈ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. తాజాగా ఈ మూవీ చివరి దశకు చేరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శివకార్తీకేయన్‏తో నటించడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. శివ చాలా మంచి సహనటుడు. చెన్నైలో నాకు కావాల్సిన ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పేవారు. అలాగే డైలాగ్స్ విషయంలో కూడా నాకు చాలా సాయం చేసేవారు. అంతేకాకుండా సెట్‏లో ఆయన ఎంతో సరదాగా ఉంటూ జోక్స్ వేసేవారు. చిత్రీకరణ ప్రారంభమైన కొన్ని రోజులకు మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అదేంటంటే.. సెట్‏లో ఉన్నంతసేపు ఆయన నాతో ఇంగ్లీష్ మాట్లాడాలి. అలాగే నేను ఆయనతో తమిళంలో మాట్లాడాలి” అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.

Also Read:

Mosagallu Movie Update: మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ విడుదల తేదీ ఖరారు ?.. ఆ రోజునే రాబోతుందంటూ..