Rajeev Kanakala : 40 ఏళ్ల నిరీక్షణ.. మొదటిసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న రాజీవ్ కనకాల..

నటుడు రాజీవ్ కనకాల టాలీవుడ్ స్టార్ హీరోతో నటించడానికి 40 ఏళ్లు ఎందుకు పట్టిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. సరైనోడులో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తన ఆలోచనను ఎలా మార్చాయో తెలిపారు. విశ్వంభర ఆలస్యానికి కారణం, ఆయన అంకితభావం, రాజమౌళి టెక్నికల్, భావోద్వేగ గొప్పదనం గురించి కూడా మాట్లాడారు. నటులకు పీఆర్ ఎంత ముఖ్యమో ఆయన చెప్పారు.

Rajeev Kanakala : 40 ఏళ్ల నిరీక్షణ.. మొదటిసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న రాజీవ్ కనకాల..
Rajeev Kanakala

Updated on: Oct 30, 2026 | 8:18 PM

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడానికి 40 ఏళ్లు ఎందుకు పట్టిందో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుతమైన విజన్ గురించి, అలాగే ఇతర ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. చిరంజీవితో కలిసి నటించడానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందో తనకు తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. గతంలో, తెరపై తన నటన చూసి అవకాశాలు వాటంతట అవే వస్తాయని తాను భావించేవాడినని వెల్లడించారు. అయితే, “సరైనోడు” చిత్రం సమయంలో అల్లు అర్జున్ తన వద్దకు వచ్చి, పది మంది ఆర్టిస్టులు ఉన్నా ఫ్రేమ్‌లో తన కన్ను తనను మాత్రమే చూడాలని కోరుకుంటుందని, తన స్క్రీన్ ప్రజెన్స్ గొప్పదని ప్రశంసించాడని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్, “మీరు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయరు? అవకాశాలు అడగాలి కదా” అని అన్నప్పుడు తన ఆలోచనా విధానం మారిందని రాజీవ్ కనకాల తెలిపారు. అప్పటి నుండి తన మేనేజర్ సుధీర్‌ను రంగంలోకి దింపి, అవకాశాల కోసం చురుకుగా అడుగుతున్నానని చెప్పారు. కొత్త నటులు కూడా తమకు విద్య ఉందని కూర్చోకుండా, పీఆర్ ఎంత ముఖ్యమో గ్రహించి, అవకాశాల కోసం అడగాలని ఆయన సలహా ఇచ్చారు. పీఆర్ తెలియక ఎంతో మంది మంచి నటులు కనుమరుగైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజీవ్ కనకాల చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” చిత్రం గురించి మాట్లాడుతూ, భారీ బడ్జెట్, అధిక అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా ఆలస్యం కావడానికి కారణం నాణ్యత, పరిపూర్ణత అని స్పష్టం చేశారు. చిత్రంలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ఉన్నందున, అవి అద్భుతంగా రావడానికి సమయం పడుతోందని వివరించారు. చిరంజీవి కమిట్‌మెంట్‌ను రాజీవ్ కనకాల కొనియాడారు. “అంజి” సినిమా కోసం చిరంజీవి ఆరు సంవత్సరాలు ఒకే షర్ట్‌ను కంటిన్యూటీ కోసం వాడారని, ఆయన కమిట్‌మెంట్ ఏ స్థాయిదో ఇది తెలియజేస్తుందని ఉదాహరించారు. ఈ వయసులో కూడా ఆయన చేసే వ్యాయామాలు, తనను తాను ఫిట్‌గా ఉంచుకునే విధానం అద్భుతమని ప్రశంసించారు. 40 ఏళ్ల తర్వాత అయినా చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పనితీరుపై రాజీవ్ కనకాల తన ప్రశంసలు కురిపించారు. ఒకానొక సమయం తర్వాత రాజమౌళి సినిమాల్లో టెక్నాలజీ, గ్రాఫిక్స్, ఏఐ వినియోగం పెరిగిందని, అయితే ఎంత టెక్నాలజీ వాడినా భావోద్వేగాలను పండించడంలో ఆయనకు తిరుగులేదని అన్నారు. రాజమౌళి ఆలోచనా విధానం, కాన్వాస్ చాలా పెద్దవని, ఆయన లార్జర్ దెన్ లైఫ్ కథలను కోరుకుంటారని పేర్కొన్నారు. స్టూడెంట్ నంబర్ వన్ విజయంతో వచ్చిన డబ్బుతో రాజమౌళి ఏం చేశాడో రాజీవ్ కనకాల వివరించారు. ఎవరైనా అవసరాల కోసం ఖర్చు చేస్తారని, కానీ రాజమౌళి మాత్రం ఆ డబ్బుతో ఒక కంప్యూటర్ కేఫ్‌కు వెళ్లి, వ్యూఫైండర్ కోసం సెర్చ్ చేసి, దాదాపు రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశాడని తెలిపారు. ఇది టెక్నాలజీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని, అభిరుచిని తెలియజేస్తుందని అన్నారు. “ఛత్రపతి” ఇంటర్వెల్ బ్లాక్ సమయంలో ప్రేక్షకులు, సినీ ప్రముఖులు భావోద్వేగాలకు లోనై బయటకు వెళ్లిపోయిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ, భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లే జక్కన్న గొప్పదనాన్ని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

రాజీవ్ కనకాల, చిరంజీవి..

Rajeev Kanakala, Chiranjeev

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Loading...
Unable to load recommendations.
Follow Us