AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్‌తో అలాంటి సినిమా చేయాలనుకుంటోన్న రాజమౌళి..!

ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్‌ బాబును డైరెక్ట్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.

మహేష్‌తో అలాంటి సినిమా చేయాలనుకుంటోన్న రాజమౌళి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 05, 2020 | 7:30 AM

Share

ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్‌ బాబును డైరెక్ట్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ కాంబోలో మూవీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా.. మొత్తానికి అధికారిక ప్రకటన రావడంతో మహేష్‌ ఫ్యాన్స్‌ చాలా ఖుషీగా ఉన్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా తెరకెక్కబోతుంది..? అన్నది ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మహేష్‌తో రాజమౌళి జేమ్స్‌ బాండ్ తరహా చిత్రాన్ని చేయబోతున్నారని మొదటి నుంచి టాక్‌ నడుస్తోంది. ఇక తాజాగా వీరి కాంబోలో మూవీకి సంబంధించి మరో వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

సూపర్‌స్టార్‌తో జక్కన్న చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కథను సిద్ధం చేయమని.. ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కి రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఇంతవరకు మహేష్‌.. చారిత్రాత్మక చిత్రంలో నటించలేదు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన మహేష్.. రాజమౌళి లాంటి దర్శకుడు ఉంటే చారిత్రాత్మక సినిమాలో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని. లేకపోతే అలాంటి కథల్లో నటించేందుకు కాస్త ఆలోచిస్తానని తెలిపారు. ఈ క్రమంలో జక్కన్న కూడా మహేష్ కోసం చారిత్రాత్మక చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: సేల్స్‌మన్‌కి జాక్‌పాట్‌.. లక్షలు కాదు ఏకంగా ఎన్ని కోట్ల లాటరీ గెలిచాడంటే..!

Follow Us