AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిల బ్యాగులో తప్పక ఉండాల్సిన 3 వస్తువులు ఇవే.. మిమ్మల్ని కాపాడే వీటిని లైట్ తీసుకోవద్దు..

స్కూల్‌కి వెళ్లిన పాప క్షేమంగా వస్తుందా? ఆఫీస్‌కి వెళ్లిన అమ్మాయి టైమ్‌కి చేరుకుంటుందా? నేడు ప్రతి ఇంట్లో సగటు తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలివి. దేశంలో ఎక్కడ చూసినా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. భయపడుతూ బతకడం కంటే, మనల్ని మనం రక్షించుకోవడమే సరైన మార్గం. అందుకే ప్రతి అమ్మాయి తన బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన ఆ మూడు వస్తువుల గురించి తెలుసుకుందాం..

అమ్మాయిల బ్యాగులో తప్పక ఉండాల్సిన 3 వస్తువులు ఇవే.. మిమ్మల్ని కాపాడే వీటిని లైట్ తీసుకోవద్దు..
Women Safety Tips
Krishna S
|

Updated on: Jun 25, 2026 | 10:29 PM

Share

దేశంలో ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. స్కూల్, కాలేజీ, ఆఫీస్.. ఇలా ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన తగ్గడం లేదు. బయట వ్యక్తులే కాదు, తెలిసిన వారు, బంధువుల నుంచి కూడా ముప్పు పొంచి ఉన్న తరుణంలో.. భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి బదులుగా, ఆత్మరక్షణకు సిద్ధం కావడమే ఏకైక మార్గమని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి మహిళ తన బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన మూడు రక్షణ ఆయుధాల గురించి నిపుణులు కీలక సూచనలు చేశారు.

పెప్పర్ స్ప్రే

మహిళల భద్రత కోసం అత్యంత ప్రజాదరణ పొందిన సాధనం పెప్పర్ స్ప్రే. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నా, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి మిమ్మల్ని వెంబడించినా లేదా దాడికి ప్రయత్నించినా, పెప్పర్ స్ప్రేను వారి కళ్లపై ప్రయోగిస్తే అవతలి వ్యక్తి కొంతసేపు చూపు కోల్పోయి, తీవ్రమైన మంటతో ఇబ్బంది పడతారు. ఆ గ్యాప్‌లో మీరు సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి లేదా ఇతరుల సహాయం కోరడానికి సమయం దొరుకుతుంది.

పర్సనల్ సేఫ్టీ అలారం

ఒంటరి ప్రదేశాల్లో లేదా రాత్రి సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పరికరం ప్రాణదాతగా మారుతుంది. దీనిని ఆన్ చేయగానే వచ్చే భారీ శబ్దం చుట్టుపక్కల ఉన్న వారి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది. ఆకస్మికంగా వచ్చే ఈ శబ్దానికి దుండగులు భయపడి పారిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఆపదలో ఉన్నారనే విషయం ఇతరులకు సులభంగా అర్థమవుతుంది.

ఫోల్డింగ్ నైఫ్ లేదా మల్టీ టూల్

ఆపత్కాలంలో ఆత్మరక్షణ కోసం ఒక చిన్న మడత కత్తి లేదా సేఫ్టీ టూల్‌ను పర్సులో ఉంచుకోవడం మంచిది. అయితే దీనిని పర్సు అడుగున కాకుండా, అత్యవసర సమయంలో క్షణాల్లో తీయడానికి వీలైన చోట ఉంచుకోవాలి. ఇది మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా శారీరక దాడి నుంచి తక్షణం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. కేవలం ఆయుధాలు వెంట ఉంటే సరిపోదు.. వాటిని ఎలా వాడాలో తెలిసి ఉండడం, ఆత్మవిశ్వాసంతో ఉండడం మరింత ముఖ్యం. పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని మర్చిపోవద్దు.

Follow Us
అమ్మాయిల బ్యాగులో తప్పక ఉండాల్సిన 3 వస్తువులు ఇవే..
అమ్మాయిల బ్యాగులో తప్పక ఉండాల్సిన 3 వస్తువులు ఇవే..
సోనీ నుంచి సరికొత్త ఫీచర్లతో థియేటర్ ఉత్పత్తులు
సోనీ నుంచి సరికొత్త ఫీచర్లతో థియేటర్ ఉత్పత్తులు
మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే..
మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే..
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఇక సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఇక సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
ఇంట్లో సాలీడుల బెడద ఎక్కువా? ఈ ఒక్క సహజ సువాసనతో వాటిని దూరంగా..
ఇంట్లో సాలీడుల బెడద ఎక్కువా? ఈ ఒక్క సహజ సువాసనతో వాటిని దూరంగా..
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి..
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి..
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..