Shilpa Shetty: భర్త విడుదలపై స్పందించిన శిల్పాశెట్టి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఇంతకీ ఏమన్నారంటే.!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:16 PM

Raj Kundra Case: అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు నిన్న ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే..

Shilpa Shetty: భర్త విడుదలపై స్పందించిన శిల్పాశెట్టి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఇంతకీ ఏమన్నారంటే.!
Raj Kundra, Shilpa Shetty
Follow us on

ఎట్టకేలకు రాజ్‌కుంద్రా జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు. దాదాపు రెండు నెలల తర్వాత అన్ని ఫార్మాలిటీస్‌ ముగిశాక ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి బెయిల్‌పై ఇవాళ రాజ్ కుంద్రా విడుదలయ్యారు. అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు నిన్న ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక భర్తకు బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించారు. ‘బీభత్సమైన తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది’ అంటూ ప్రముఖ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్‌ను ఆమె పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కాగా 2009లో రాజ్‌కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్‌ అనంతరం శిల్పాశెట్టి కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు హాజరుకాలేదు. ఈ మధ్యే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న శిల్పా , రాజ్‌తో వివాహం రద్దు చేయాలని భావిస్తున్నట్లు బీటౌన్‌లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ ఆలోచన లేనట్లేనా? లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాలి.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!