Raj Kundra Case: అమ్మ దొంగా.. అరెస్టును ముందే పసిగట్టిన రాజ్ కుంద్రా..పాత ఫోన్‌ను ఏం చేశారంటే?

|

Jul 27, 2021 | 4:19 PM

Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ చిత్రాల కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా(బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త) చీకటి వ్యవహారాల చిట్టా విప్పుతున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.

Raj Kundra Case: అమ్మ దొంగా.. అరెస్టును ముందే పసిగట్టిన రాజ్ కుంద్రా..పాత ఫోన్‌ను ఏం చేశారంటే?
Raj Kundra - Shilpa Shetty
Follow us on

Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ చిత్రాల కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా (బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త) చీకటి వ్యవహారాల చిట్టా విప్పుతున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. తప్పు చేస్తున్నందున పోలీసులు తనను అరెస్టు చేయొచ్చని రాజ్ కుంద్రా ముందే పసిగట్టాడు. ఆ మేరకు పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కొన్ని మాసాల ముందే పథక రచన చేశాడు. ప్లాన్ బీ‌లో భాగంగా తన పాత మొబైల్ ఫోన్‌ను మార్చి నెలలో ఎక్కడో విసిరికొట్టాడు. కొత్త ఫోన్ వాడటం మొదలుపెట్టాడు. పాత ఫోన్‌లో డేటా పోలీసుల చేతికి చిక్కకుండా రాజ్ కుంద్రా ఈ ఎత్తుగడవేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో నిర్థారించారు. రాజ్ కుంద్రా కేసును దర్యాప్తు జరుపుతున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాలు వెల్లడించింది.

కేసు విచారణలో భాగంగా పాత ఫోన్ ఎక్కడుందని రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించగా..దాన్ని పడేసినట్లు కుంద్రా సమాధానమిచ్చినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. పోర్నోగ్రఫీ చిత్రాల కేసులో రాజ్ కుంద్రా ప్రమేయాన్ని నిరూపించేందుకు అవసరమైన పలు ఆధారాలు ఆ పాత ఫోన్‌లో ఉండే అవకాశముందన్నారు. సదరు పాత ఫోన్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల జాయింట్ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపారు. పోర్నోగ్రఫీ చిత్రాలను ప్రసారం చేసే హాట్‌షాట్స్, బాలీ ఫేమ్ యాప్స్ ద్వారా వచ్చే ఆదాయం ఈ జాయింట్ అకౌంట్‌కు వచ్చేదని అనుమానం వ్యక్తంచేశారు.

కాగా ఈ కేసులో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రాజ్ కుంద్రా దగ్గర పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసులో సాక్ష్యులుగా మారడం తెలిసిందే. వారి ద్వారా రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించగలమని ముంబై క్రైం బ్రాంక్ పోలీసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రాజ్ కుంద్ర పోలీస్ కస్టీ ముగియడంతో మంగళవారం ఆయన్ను ముంబైలోని కోర్టు ఎదుట హాజరుపర్చారు. మరో వారం రోజుల పాటు పోలీసు కస్టడీని పొడగించాలన్న ముంబై పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు… కుంద్రాను 14 రోజుల(ఏప్రిల్ 10 వరకు) జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉందగా రాజ్ కుంద్ర బెయిల్ పిటిషన్ బుధవారం కోర్టులో విచారణకు రానుంది.

Also Read..

రాజ్‌ కుంద్రాకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. జ్యూడిషియల్‌ కస్టడీకి తరలింపు..

లాక్‌డౌన్‌ జీవితంపై ప్రగ్యా జైస్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు .. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిందంటూ వేదాంతం