Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..

Sai Dharam Tej Accident: మాదాపూర్ కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌పై, రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..
Sai Dharam Tej

Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2021 | 5:34 PM

Sai Dharam Tej Accident: మాదాపూర్ కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌పై, రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ ఆరోపణలతో ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు.. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ప్రమాద స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే.. సాయిధరమ్ తేజ్ బైక్‌పై ఓవర్ స్పీడ్ చలాన్ ఉంది. 2020 అగస్ట్ 2వ తేదీన ఓవర్ స్పీడ్ నేపథ్యంలో చలాన్ పడింది.

ఇకపోతే.. సాయిధరమ్ తేజ్ వాడిన బైక్ (ట్రంప్) చాలా ఖరీదైన స్పోర్ట్స్ బైక్. 765 సీసీ ట్రిపుల్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ ధర రూ. 18 లక్షలు. ఈ బైక్‌పై గతంలోనే చలాన్లు ఉన్నాయి. తేజ్ నడిపిన బైక్ అనిల్ కుమార్ బుర్ర పేరిట రిజిస్ట్రార్ అయి ఉంది.

సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్‌కు గురవడం వల్ల షాక్‌లో అపస్మారకస్థితిలోకి వెళ్లారని, మరే ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. కాగా, తేజ్ కుటుంబ సభ్యులందరూ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Also read:

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. ఇదిగో ఇలా స్కిడ్ అయ్యింది.. వీడియో ఫుటేజీ..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే?