Pushpa Sunil: మంగళం శ్రీను మరీ ఇంత కృరంగా ఉన్నాడేంటీ.. పుష్ప నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్‌..

|

Nov 07, 2021 | 11:47 AM

Pushpa Sunil: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు..

Pushpa Sunil: మంగళం శ్రీను మరీ ఇంత కృరంగా ఉన్నాడేంటీ.. పుష్ప నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్‌..
Pushpa Movie Sunil
Follow us on

Pushpa Sunil: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు స్టైలిష్‌ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తి స్థాయిలో మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఒక్క బన్నీనే కాకుండా అన్ని పాత్రలు మాస్‌ లుక్‌లోనే ఉండనున్నాయి. చివరికి క్యూట్‌ గర్ల్‌ రష్మికను కూడా సుకుమార్ ఊర మాస్‌గా చూపించారు. దీంతో ఈ సినిమాలోని పాత్రలపై ఎక్కడలేని ఆసక్తినెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సునీల్‌ విలన్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా చిత్ర యూనిట్‌ సునీల్‌ పాత్రను పరిచయం చేసింది. ఇందులో సునీల్‌ మంగళం శ్రీను పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సునీల్‌ గతంలో ఎన్నడూ తెరపై కనిపించని విధంగా ఉన్నాడు. పూర్తిగా మాస్‌లుక్‌లో ఓ రకంగా చెప్పాలంటే భయంకరంగా ఉన్నాడు. ఈ సినిమాలో సునీల్‌ కృరమైన ఓ స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నాడు. కేవలం ఒక్క లుక్‌తోనే పాత్ర ఎంత భయంకరంగా ఉందో చూపించిన సుకుమార్‌.. సునీల్‌ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఇంకెలా ఉంటుందని సినీ లవర్స్‌ అనుకుంటున్నారు. ఇక సుకుమార్‌ ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్న తీరు కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తొలుత ఒకే పార్ట్‌గా విడుదల చేద్దామనుకున్నా.. కథ నిడివి ఎక్కువ కావడంతో రెండు పార్టులుగా విడుదల చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే తొలి పార్ట్‌ను డిసెంబర్‌ 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో తెలియాంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Karthikeya: అభిమానులందరి సమక్షంలో అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ఆర్‌ఎక్స్‌ 100 హీరో.. ఎమోషనల్‌ అయిన లోహిత..

Free Ration: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. మరో ఆరు నెలలపాటు ఉచిత రేషన్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

IIT Recruitment: ఐఐటీ మండిలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తుచేసుకోవాలి.?