Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న నాగచైతన్య.. తొలిసారి అలా కనిపించడానికి సిద్ధమవుతోన్న అక్కినేని హీరో..

Naga Chaitanya: కరోనా పుణ్యామాని ఓటీటీ రంగం బాగా అభివృద్ధి చెందింది. థియేటర్లు మూతపడడంతో జనాలు ఇంట్లోనే సినిమాలు వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఓటీటీ రంగంలో...

Naga Chaitanya: షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న నాగచైతన్య.. తొలిసారి అలా కనిపించడానికి సిద్ధమవుతోన్న అక్కినేని హీరో..
Naga Chaitanya
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 07, 2021 | 11:19 AM

Naga Chaitanya: కరోనా పుణ్యామాని ఓటీటీ రంగం బాగా అభివృద్ధి చెందింది. థియేటర్లు మూతపడడంతో జనాలు ఇంట్లోనే సినిమాలు వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఓటీటీ రంగంలో వెబ్‌ సెరీస్‌లు పెను సంచలనం సృష్టించాయి. బడా నటీనటులు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించడానికి వెనుకడుగు వేయకపోవడం, బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే సమంత, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్‌లు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌లలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు హీరోలు కూడా వీటిలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో ఈ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు యంగ్‌ హీరో నాగచైతన్య.

సమంత బాటలోనే నడుస్తూ తాను కూడా వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో నాగచైతన్య నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని నాగచైతన్య కూడా ధృవీకరించాడు. అంతేకాకుండా ఈ వెబ్‌ సిరీస్‌ హర్రర్‌ కథాంశంతో వస్తున్నట్లు తెలిపాడు. ఈ వెబ్‌ సిరీస్‌లో నాగచైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. నాగచైతన్య తన కెరీర్‌లో హర్రర్‌ కథలో నటిస్తుండడం ఇదేతొలిసారి కావడం విశేషం.

ఇదిలా ఉంటే మొదట కథ విన్న నాగచైతన్య కాస్త ఆశ్చర్యపడ్డా పాత్ర నచ్చడంతో సినిమాకు ఒప్పుకున్నట్లు తెలిపాడు. మరి తొలిసారి నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్న నాగచైతన్య ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు.

Also Read: మేకప్‌ లేకుండా భార్యను చూసి షాకైన భర్త.. భార్య తనను మోసం చేసిందంటూ.. విడాకుల కోసం కోర్టుకు..

IIT Recruitment: ఐఐటీ మండిలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తుచేసుకోవాలి.?

Viral Video: ఈటింగ్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి.. అసలు ఏంజరిగిందంటే..?? వీడియో

పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?