Puneeth Rajkumar: పెండింగ్‌ సినిమాలెన్ని.. శాండిల్‌వుడ్‌కు ఎంత నష్టం .. ఊహించగలరా..

పునీత్‌ రాజ్‌కుమార్ హఠ్నామరణం శాండిల్‌వుడ్‌ను షాక్‌కు గురిచేసింది. బాడీ బిల్డర్‌పై నిర్మాతల భారీ ఆశలు గల్లంతయ్యాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ రన్నింగ్‌లో ఉన్న సినిమాలెన్ని? పెండింగ్‌ ప్రాజెక్ట్‌లేంటి?

Puneeth Rajkumar: పెండింగ్‌ సినిమాలెన్ని.. శాండిల్‌వుడ్‌కు ఎంత నష్టం .. ఊహించగలరా..
Puneeth Rajkumar
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 30, 2021 | 5:01 PM

పునీత్‌ రాజ్‌కుమార్ హఠ్నామరణం శాండిల్‌వుడ్‌ను షాక్‌కు గురిచేసింది. బాడీ బిల్డర్‌పై నిర్మాతల భారీ ఆశలు గల్లంతయ్యాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ రన్నింగ్‌లో ఉన్న సినిమాలెన్ని? పెండింగ్‌ ప్రాజెక్ట్‌లేంటి? పునీత్ మృతితో శాండిల్‌వుడ్‌కు వచ్చే నష్టమెంత?  పునీత్ హీరోగా రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. జేమ్స్, ద్విత్వ సినిమాల్లో మొదటిది షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నాడు. జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్ల రూపాయలు. రీసెంట్‌గా కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది ఈ లోపే ఇలా జరగడంతో ఈ సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది.

కొత్త కథతో మొదలవ్వబోతుంది ద్విత్వ. ఈ సినిమా బడ్జెట్ కూడా 60 కోట్లకు పైనే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జేమ్స్ షూటింగ్ అయిపోగానే డిసెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇంతలోనే పునీత్ ఆకస్మిక మరణం దర్శక నిర్మాతలను షాక్‌కు గురిచేసింది. యువరత్నసినిమా చేసిన డైరెక్టర్‌తోనూ మరో సినిమా ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ఇక ఆగిపోయినట్లే.

పునీత్ రాజ్ కుమార్ కన్నడ పవర్ స్టార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలు పెట్టి ఎన్నో హిట్ సినిమాలతో పవర్ స్టార్ గా ఎదిగారు. ఈయన ఒక్కో సినిమా బడ్జెట్ ఈజీగా 50 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన పునీత్ యువరత్నభారీ హిట్‌ కొట్టింది. ఏటా కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు పునీత్.

నిర్మాతగా కూడా పునీత్ సినిమాలు నిర్మిస్తారు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ రెండింటి బడ్జెట్లు కలిపి 50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

ఇలా పునీత్‌ను దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునీత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఈ సినిమాలు, ఈ సినిమాలను నమ్ముకున్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి: Jr NTR – Puneeth Rajkumar: కుటుంబ సభ్యులకు ఓదార్పు.. పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ కడసారి నివాళి..

Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..

PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే