పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ 28వ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు

పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!

Edited By:

Updated on: Sep 04, 2020 | 7:05 PM

Pawan Kalyan 29 movie: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ 28వ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలవబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఒకప్పుడు ఈ జోడీకి మంచి డిమాండ్ ఉండేది. ఈ కాంబోలో తెరకెక్కిన కిక్‌, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. అయితే కిక్‌ 2 ఫ్లాప్ కావడంతో సురేందర్ రెడ్డి, వక్కంతం మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ తరువాత వంశీ పక్కకు వచ్చి.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా మారారు. అయితే అది ఫ్లాప్ అవ్వగా.. వక్కంతంకు మరో హీరో ఎవరూ ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కోసం సురేందర్ రెడ్డి, వంశీ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పెద్ద హిట్ కోసం ఈ ఇద్దరు కష్టపడుతున్నారని సమాచారం. కాగా ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు.

Read More:

‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు షాక్‌‌.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!

కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ ఫోర్జరీ.. డాక్టర్‌ అరెస్ట్‌